Breaking News

ఎస్‌బీఐ ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి!.. కేంద్రానికి తెలుగువ్యక్తి పేరు సిఫారసు

Published on Sat, 06/29/2024 - 20:58

ఎస్‌బీఐ కొత్త ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని.. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) సిఫారసు చేసింది. ఈ పదవి కోసం ప్యానల్ ముగ్గురుని ఇంటర్వ్యూ చేసి చల్లాను ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదించింది. పనితీరును దృష్టిలో ఉంచుకుని ఈయన పెరుగు ప్రతిపాదించినట్లు ఎఫ్ఎస్ఐబీ పేర్కొంది.

ఎస్‌బీఐ కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ప్రతిపాదించినప్పటికీ.. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత ఛైర్మన్‌గా ఎవరనేది అధికారికంగా వెలువడుతుంది.

ప్రస్తుతం ఎస్‌బీఐ ఛైర్మన్‌గా దినేశ్ కుమార్ ఖారా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన 2020 అక్టోబర్ 7న ఎస్‌బీఐ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. అయితే ఈయన పదవీకాలం గత ఏడాది అక్టోబర్‌లోనే ముగిసింది. కానీ కేంద్రం మళ్ళీ మళ్ళీ పొడిగించింది. కాగా ఈయన ఆగష్టు 28వరకు ఎస్‌బీఐ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆ తరువాత ఈ స్థానంలోకి కొత్త ఛైర్మన్‌ వస్తారు.

ఇక చల్లా శ్రీనివాసులు శెట్టి విషయానికి వస్తే.. ఈయన ప్రస్తుత గద్వాల జిల్లా పెద్దపోతుల పాడులో జన్మించారు. అక్కడే ప్రాధమిక విద్యను పూర్తి చేసి.. ఆ తరువాత హైస్కూల్, ఇంటర్మీడియట్ గద్వాల్‌లో పూర్తి చేశారు. ఆ తరువాత అగ్రికల్చర్ పూర్తి చేశారు. ఈయన 1988లో ఎస్‌బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా తన వృత్తి ప్రారంభించారు. బ్యాంకింగ్ రంగంలో ఈయనకు సుమారు 36 సంవత్సరాలు అనుభవం ఉంది.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)