రెస్టారెంట్లలో ఫ్రీగా మంచి నీరు ఇవ్వాల్సిందే..

Published on Thu, 08/06/2026 - 11:23

హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు వినియోగదారులు ఫుడ్‌ ఆర్డర్‌ ఇచ్చే ముందు అక్కడి స్టాఫ్‌ ‘మినరల్ వాటరా, రెగ్యులర్ వాటరా?’ అని అడగడం చూస్తూంటాం. సాధారణంగా కస్టమర్లు సంకోచంతోనో, సమాచారం లేకనో ఖరీదైన బాటిల్ వాటర్‌ను ఎంచుకుంటూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఈ వ్యాపార ధోరణిపై మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్‌డీఏ) చర్యలు చేపట్టింది.

ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం రెస్టారెంట్లలో కస్టమర్లకు ఉచితంగా సురక్షితమైన తాగునీటిని అందించడం ప్రాథమిక హక్కు అని రాష్ట్ర ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. ఇకపై ఏ హోటల్ లేదా రెస్టారెంట్ కూడా వినియోగదారుడిని బాటిల్ వాటర్ కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకూడదు. అడగకుండానే ముందే ఉచిత తాగునీటిని అందించాలని ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే ఆదేశాలు జారీ చేశారు.

నిబంధనలు.. సూచనలు

  • రెస్టారెంట్లలో ఉచితంగా తాగునీరు అందుబాటులో ఉందనే సమాచారాన్ని వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలి.

  • నూనె పదార్థాలను వార్తాపత్రికలపై పెట్టి ఇవ్వడం పూర్తిగా నిషేధించారు. ఫుడ్-గ్రేడ్ ప్యాకేజింగ్ మాత్రమే వాడాలి.

  • సిబ్బందికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రవేశపెట్టిన ప్రత్యేక కార్యక్రమం శిక్షణను నిర్బంధం చేశారు. వంటనూనెలను పదే పదే వాడటంపై ఆంక్షలు విధించారు.

  • హోటల్ లేదా రెస్టారెంట్ ప్రవేశ ద్వారం వద్ద ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్‌ను స్పష్టంగా ప్రదర్శించాలి.

ఈ ఆదేశాలను ఉల్లంఘించే సంస్థలపై భారీ జరిమానాలతో పాటు లైసెన్సుల రద్దు వంటి కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది.

ఇదీ చదవండి: ఆపద వస్తే తెలియాల్సిన అంశాలు ఇవే..

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)