Breaking News

ఇల్లు కొంటే ఖరీదైన బైక్‌.. తులం బంగారం

Published on Sat, 03/14/2026 - 05:07

షాపుల్లో మెగా సేల్స్‌.. బంపర్‌ ఆఫర్లు చూస్తుంటాం.. ఈ కామర్స్‌ సంస్థల ఇయర్‌ ఎండింగ్‌ డిస్కౌంట్లు చూస్తుంటాం.. మైక్‌ పట్టుకొని ‘రండి బాబూ రండి.. ఇలాంటి సువర్ణావకాశం మళ్లీ రాదు..’ అంటోంది స్థిరాస్తి రంగం. అందుబాటు ధరలు ఉండే హైదరాబాద్‌లో ఒకప్పుడు ప్రాపర్టీలు హాట్‌ కేక్‌లు. నిర్మాణం పూర్తి కాకముందే బ్రోచర్ల మీదే ఫ్లాట్ల అమ్మకాలు పూర్తయ్యేవి. ధరలు, నాణ్యత, బిల్డర్ల ట్రాక్‌ రికార్డ్‌లు, మార్కెట్‌ సెంటిమెంట్‌ అలా ఉండేది. 360 డిగ్రీల కోణంలో గృహ కొనుగోలుదారులను ప్రోత్సహించేలా, ఆకర్షించేలా ఉండేది. కానీ, కొన్నేళ్లుగా మార్కెట్‌ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  – సాక్షి, సిటీబ్యూరో

మారిన పరిస్థితులతో పాటు కొన్ని ప్రతికూలతలతో స్థిరాస్తి రంగంలో సెంటిమెంట్‌ పూర్తిగా దెబ్బతింది. దీంతో విక్రయాలు లేక నిర్మాణ రంగం 
క్షీణించే దశకు చేరుకుంది. ఈ రంగంపైనే ఆధారపడిన నిర్మాణ సంస్థలు, బిల్డర్లు కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫర్ల వల వేయక తప్పడం లేదు. ఇళ్ల అమ్మకాలను పెంచుకునేందుకు విలువైన బైక్, ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌(ఈవీ), తులం బంగారం, ఉచిత ఇంటీరియర్‌.. ఇలా రకరకాల ఆఫర్లతో ముందుకొస్తున్నారు.

నిర్మాణ సంస్థలెన్నో..  
స్థిరాస్తి రంగంలో ఆఫర్ల వల కొత్తేమీ కాదు. గతంలో ఉచిత ఇంటీరియర్, క్లబ్‌హౌస్‌ సభ్యత్వం, మాడ్యులర్‌ కిచెన్‌ వంటి పరిమిత స్థాయిలో ఉండేది. ప్రస్తుతం హైదరాబాద్‌లో గృహ విక్రయాలు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో నగరంలోని చిన్నా, పెద్దా డెవలపర్లు, నిర్మాణ సంస్థలు కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రీమియం మోటార్‌ సైకిళ్లు, 24 క్యారెట్ల బంగారం నాణేలు, ఈవీ వాహనాలు, ఉచిత ఇంటీరియర్‌ వంటి ఖరీదైన బహుమతులను అందజేస్తున్నాయి. ఉదాహరణకు నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కోకాపేట, కూకట్‌పల్లి, ఉప్పల్, పటాన్‌చెరు, రాజేంద్రనగర్‌లలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లలో అపార్ట్‌మెంట్‌ బుకింగ్‌తో ప్రతి కొనుగోలుదారుడికి రూ.3 లక్షల విలువైన హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌ను ఉచితంగా అందజేస్తామని ప్రచారం చేస్తోంది. మరో డెవలపర్‌ ఉప్పల్, రామాంతాపూర్‌లలో రాబోయే ప్రాజెక్ట్‌లో ప్రతి కస్టమర్‌కు రూ.8 లక్షల విలువైన ఈ–వాహనాన్ని అందిస్తామని ప్రచారం చేస్తున్నారు.

ఆఫర్లతో విక్రయాలు స్పల్పకాలమే.. 
వేగంగా విక్రయాలు జరుపుకునేందుకు ఇలాంటి ఆఫర్లతో ప్రయత్నాలు చేస్తుంటారని డెవలపర్ల సంఘం ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రతికూల మార్కెట్‌లో అమ్ముడుపోని ఇన్వెంటరీని విక్రయించేందుకు ఇలాంటి ప్రత్యేక డీల్స్‌ను ప్రవేశపెడుతుంటారు. అయితే ఈ ఉచితాల ధర ప్రాజెక్ట్‌ ధరలో భాగం అవుతుందని, ఈ తరహా మార్కెట్‌ స్వల్పకాలంలో అమ్మకాలను పెంచినా..  స్థిరమైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సొంతింటి కలను సాకారం చేసుకోవాలంటే ఉచితాలు కాకుండా ధర, నిర్మాణ నాణ్యత, ప్రాంతాన్ని చూసి ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

బంగారంతో ఆకర్షణ.. 
పసిడి ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆఫర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఫ్లాట్‌ బుకింగ్‌ చేసుకునే కస్టమర్లకు రిటర్న్‌ గిఫ్ట్‌ అందజేసే సంప్రదాయంగా పెరుగుతోంది. మియాపూర్‌కు చెందిన ఓ డెవలపర్‌ రూ.75–85 లక్షల మధ్య ధర కలిగిన రెండు, మూడు పడక గదుల ఇంటి కొనుగోలుపై కస్టమర్‌కు రూ.3 లక్షల విలువైన బంగారం ఇస్తామని ప్రకటించారు. అంటే దగ్గరిదగ్గర 10–14 గ్రాముల బంగారం ఇస్తున్నారు. అలాగే పిల్లల బెడ్‌ రూమ్‌కు ఇంటీరియర్, మాడ్యులర్‌ కిచెన్‌తో పాటు అందజేస్తామని ప్రచారం చేస్తున్నారు.

రెరా పరిధిలోకి రావు.. 
ఆఫర్లు, ప్రోత్సాహకాలు కస్టమర్లను ఆకర్షించేందుకు డెవలపర్లు పన్నే వాణిజ్య వ్యూహాలు. అయితే ఈ ఉచిత ఆఫర్ల ప్రకటనలు తెలంగాణ స్టేట్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ(టీజీ రెరా) నియంత్రణ పరిధిలోకి రావు. ఇవి గృహ కొనుగోలుదారులకు రక్షణ కల్పించలేవు. అయితే సేల్‌డీడ్‌లో పేర్కొన్న విధంగా హామీలను అమలు చేయడంలో డెవలపర్‌ విఫలమైతే ఈ ఉచితాలు, బహుమతులతో సహా కొనుగోలుదారులు టీజీ రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. ఆయా డెవలపర్లపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటారు. 

Videos

జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి..

పేర్ని నాని ఇంటి వద్ద హైటెన్షన్

బాగ్దాద్ పై బాంబుల వర్షం.. US ఎంబసీపై దాడులు

ఇరాన్ యుద్ధం.. బ్యాంకులో నుంచి మీ డబ్బు డ్రా చేసుకోండి...

అనసూయపై అసభ్యకర పోస్టులు.. ఇద్దరు అరెస్ట్

విజయ్ తో వివాదాలు.. రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ..!

500 కోట్ల మోసం! పోలవరం పనుల్లో అక్రమాలు CBI SP సంచలన లేఖ

అమెరికాకు వార్నింగ్ ఇస్తూ.. ఇరాన్ సంచలన వీడియో విడుదల

భరితెగించి నోడిని టీటీడీ చైర్మన్ చేయడం కరెక్టేనా..?

10 ఎగ్జామ్స్ షురూ.. పరీక్ష కేంద్రాల వద్ద టెన్షన్ టెన్షన్

Photos

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఓ షాపింగ్‌ మాల్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)