Breaking News

మొబైల్ ఫోన్‌ హ్యాక్: రూ.11.55 కోట్లు మాయం

Published on Tue, 05/20/2025 - 16:37

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకి మితిమీరిపోతున్నాయి. అమాయక ప్రజలు మాత్రమే కాకుండా.. కొన్ని సంస్థలు కూడా వీరి మాయలో పడిపోతున్నారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకుకు సంబంధించిన ఒక పెద్ద ఆన్‌లైన్ మోసం సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో మోసగాళ్ళు ఒక కస్టమర్ మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేయడం ద్వారా ఏకంగా రూ. 11.55 కోట్లు విత్‌డ్రా చేశారు.

మోసగాళ్ళు ఒక కస్టమర్‌ను మోసగించి మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చేశారు. దీని ద్వారా చంబా జిల్లాలోని బ్యాంక్ హల్టి బ్రాంచ్‌కు లింక్ అయిన అతని బ్యాంక్ ఖాతాకు యాక్సెస్ లభించింది. అంతే కాకుండా బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి NEFT, RTGS లావాదేవీల ద్వారా 20 ఖాతాలకు డబ్బును బదిలీ చేశారు.

ఈ స్కాముకు సంబంధించిన లావాదేవీలు మే 11, 12 తేదీలలో జరిగాయి కానీ, మే 13 సెలవు దినం కావడంతో, బ్యాంకు అధికారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లావాదేవీ నివేదిక అందిన తర్వాత మే 14న ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే సిమ్లా సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: ప్రపంచంలోనే తొలి AI హాస్పిటల్: డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే..

స్కామ్ బయటపడిన వెంటనే.. బ్యాంక్ అధికారులు సంబంధిత ఖాతాలను స్తంభింపజేశారు. దీనిపై లోతైన దర్యాప్తు నిర్వహించడానికి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) బృందం సిమ్లాకు చేరుకోనుంది. హ్యాకర్లు ఎలా ప్రవేశించారు, బ్యాంక్ వ్యవస్థలకు ఇతర భద్రతా బలహీనతలు ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేయనున్నారు.

డిజిటల్ బ్యాంకింగ్ మోసాలను నివారించడానికి RBI మార్గదర్శకాలు
➤మీ లాగిన్ వివరాలు, పిన్, ఓటీపీ లేదా కార్డడుల సమాచారాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.
➤అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం లేదా తెలియని ఫైల్‌లను డౌన్‌లోడ్ చేయడం మానుకోవాలి.
➤యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో కూడా జాగ్రత్త వహించాలి.
➤బ్యాంకులకు సంబంధించిన ఏవైనా వివరాలు కావాలనుకుంటే.. సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ లేదా అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించాలి.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)