Breaking News

వివాహితులకు ‘నోజాబ్‌’ అంటూ ఫాక్స్‌కాన్‌పై ప్రచారం.. ఎందుకంటే?

Published on Thu, 06/27/2024 - 16:43

చెన్నై: వివాహితులకు ‘నోజాబ్‌’ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఐఫోన్‌ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ ఖండించింది. తాము నియమించుకున్న ఉద్యోగుల్లో 25 తం మంది వివాహుతలైన మహిళలే ఉన్నారని స్పష్టం చేసింది.

తమిళనాడులోని చెన్నై కేంద్రంగా ఫాక్స్‌కాన్‌ సంస్థ ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌లను తయారు చేస్తుంది. అయితే ఇటీవల ఐఫోన్‌ తయారీ మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌లో మరికొంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. కానీ దీనిపై ప్రచారం మరోలా జరిగినట్లు తెలుస్తోంది. ఫాక్స్‌కాన్‌ యాజమాన్యం వివాహితులైన మహిళల్ని నియమించుకోవడం లేదనే పుకార్లు షికార్లు చేశాయి. ఈ ప్రచారంతో అప్రమత్తమైన కేంద్రం ఫాక్స్‌కాన్‌లో జరిగిన నియామకాలపై వెంటనే తమకు సమగ్ర సమాచారాన్ని అందించాలని తమిళనాడు కార్మిక శాఖకు ఆదేశాలు జారీచేసింది.    

ఉద్యోగుల నియామకంపై ఫాక్స్‌కాన్‌ వివరణ ఇచ్చినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాలు ఆధారంగా తమ ఐఫోన్‌ తయారీ ఫ్లాంట్‌లో కొత్తగా ఉద్యోగుల నియామకం జరిగిందని, వారిలో 25 శాతం మంది వివాహిత మహిళలేనని ఫాక్స్‌కాన్ ప్రతినిధులు చెప్పారు. ఉద్యోగం రాలేదని అసత్య ప్రచారం చేశారని, ఇలాంటి నిరాధారమైన ప్రచారంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ తయారీ రంగాన్ని దెబ్బతీస్తున్నాయని వారు తెలిపారు.

ఇదిలా ఉంటే, ఫాక్స్‌ కాన్‌ ఫ్లాంట్‌లో పని చేయడానికి వివాహిత మహిళలను అనుమతించకపోవడంపై పలు మీడియా సంస్థలు (అందులో పీటీఐ) ఆరా తీయగా ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ప్రస్తుతం 70 శాతం మంది మహిళలు, 30 శాతం మంది పురుషులు ఉన్నారు. తమిళనాడు ప్లాంట్ దేశంలో మహిళలు అత్యధికంగా ఉపాధి పొందుతున్న మ్యానిఫ్యాక్చరింగ్‌ యూనిట్‌గా పేరు సంపాదించింది. ఇందులో ప్రస్తుతం ఉపాధి పొందుతున్న సిబ్బంది సంఖ్య  45,000 దాటినట్లు ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులు వెల్లడించారు.    

పలు జాతీయ మీడియా కథనాలు సైతం.. ఫాక్స్‌ కాన్‌లో ఉద్యోగం రాలేదన్న కారణంతో 5 నుంచి 10 మంది ఈ అసత్య ప్రచారం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)