Breaking News

ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ రజనీష్‌ సంపాదన ఎంతో తెలిస్తే!

Published on Fri, 09/15/2023 - 16:29

MasterCard Chairman Rajnish Kumar: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) మాజీ ఛైర్మన్ రజనీష్ కుమార్ మాస్టర్‌కార్డ్  ఇండియన్‌ యూనిట్‌కు కుమార్‌ను చైర్మన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయన సంపాదన ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. దేశీయ అతిపెద్ద బ్యాంకు అధికారిగా ఉన్నప్పడు సంపాదించిన దానికంటే మూడు రెట్టు ఎక్కువ సంపాదిస్తున్నారట.  వివిధ లిస్టెడ్ సంస్థలలో డైరెక్టర్‌గా మూడు రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఒక నివేదిక తెలిపింది.

సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం  రజనీష్ కుమార్  FY 2023లో హీరో మోటోకార్ప్  ద్వారా రూ.38 లక్షలు, LTIMindtree ద్వారా  రూ. 33.2 లక్షలు, అంబుజా సిమెంట్స్ నుంచి 17.8 లక్షలు, మొత్తంగా  రూ. 89 లక్షల వేతనం పొందారు. దీనికి తోడు ఇటీవల ఎల్‌ అండ్‌ టీ, బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ బోర్డులకు నియమితులయ్యారు. బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్ FY 2023  వార్షిక నివేదిక ప్రకారం, ప్రతి స్వతంత్ర డైరెక్టర్‌కు బోర్డు, కమిటీ సమావేశాలకు హాజరు కావడానికి సిట్టింగ్ ఫీజులు, కమీషన్‌తో కలిపి సంవత్సరానికి సుమారు రూ.51 లక్షల దాకా చెల్లిస్తుంది.  2023 మార్చి 30న  బోర్డులో నియమితులైన  రజనీష్ కుమార్ తప్ప  మిగిలిన వారికి  మేనేజర్ బోర్డు సమావేశానికి హాజరైనందుకు  లక్ష సిట్టింగ్ ఫీజు చెల్లింస్తోంది. 

ఎల్‌ అండ్‌ టీ బోర్టులో మే 10, 2023 నుండి మే 9, 2028 వరకు స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు.  ఈ నేపథ్యంలో ఆయనకు బోర్డ్ ప్రతి సమావేశానికి కంపెనీ అతనికి సిట్టింగ్ ఫీజుగా  రూ.1 లక్ష చెల్లించింది.ఎస్‌బీఐ  2021 ఆర్థిక సంవత్సరంలో కుమార్ మొత్తం రూ. 30.34 లక్షల పరిహారాన్ని అందుకున్నారు.  అలాగే 2020లో అతని జీతం రూ.31.26 లక్షలు. అయితే SBIలో ఉన్నంత కాలం విలాసవంతమైన వసతి, ఉచిత రవాణా ప్రయాణ ప్రోత్సాహకాలు  తదితర అదనపు ప్రోత్సాహకాలను పొందారు. 2020 అక్టోబరు వరకు 40 సంవత్సరాలుగా ఎస్‌బీఐ వివిధ హోదాల్లో  సేవలందించిన రజనీష్‌ కుమార్‌  స్టార్టప్  భారత్‌పైకి ఛైర్మన్‌గా  ఉన్నారు.

కాగా కంపెనీల చట్టం 2013 ప్రకారం, ఏ వ్యక్తి అయినా ఒకే సమయంలో ఇరవై కంటే ఎక్కువ కంపెనీలలో ఏదైనా ప్రత్యామ్నాయ డైరెక్టర్‌షిప్‌తో సహా డైరెక్టర్‌గా పదవిని కలిగి ఉండకూడదు. అయితే 10 పబ్లిక్ కంపెనీలకు మించకుండా డైరెక్టర్‌గా  ఉండవచ్చు.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు