Breaking News

అప్పట్లో గూగుల్‌లో అత్యధిక జీతం.. ఇప్పుడు ఏకంగా బిలియనీర్‌

Published on Thu, 01/04/2024 - 08:22

నేటి రోజుల్లో బిలియనీర్‌ అవడం అనేది అసాధ్యమైన విషయమేమీ కాదు.. పాలో ఆల్టో నెటవర్క్స్‌ సీఈవో నికేష్‌ అరోరా (Nikesh Arora)నే అందుకు ఉదాహరణ. ఒకప్పుడు గూగుల్‌లో అత్యధిక జీతం అందుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా బిలియనీర్‌ అయ్యారు.

గూగుల్‌లో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పనిచేసిన నికేష్‌ అరోరా అత్యధిక వేతనం అందుకున్నారు. ఆ తర్వాత సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఆయన్ను 
ప్రపంచంలోనే అత్యుత్తమ ప్యాకేజీ చెల్లించి నియమించుకుంది. ప్రస్తుతం పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో చేరిన ఆయన బిలియనీర్ల జాబితాలోకి అడుగుపెట్టాడు. సైబర్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ పరిశ్రమ బూమ్‌ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. నికేష్‌ అరోరా నెట్‌వర్త్‌ ఇప్పుడు 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12 వేల కోట్లు)గా ఉంది. 

అరుదైన టెక్ సీఈవో
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. వ్యవస్థాపకుడు కాకుండా బిలియనీర్ అయిన అరుదైన టెక్ సీఈవోగా నికేష్‌ అరోరా నిలిచారు. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌ 2018లో నికేష్‌ అరోరాను నియమించుకున్నప్పుడు 125 మిలియన్‌ డాలర్ల విలువైన స్టాక్‌లను ఆయనకు అందించింది. హై-ప్రొఫైల్ హ్యాకింగ్‌లు ఎక్కువవుతన్న నేపథ్యంలో వ్యాపార సంస్థలకు సైబర్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ ఆవశ్యకత పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ ధర నాలుగు రెట్లు పెరిగింది. దీంతో అరోరా వాటా 830 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది.

అంతకంతకూ పెరిగిన సంపద
ఈ స్టాక్‌లు, వేతనం, సంస్థలో చేరినప్పుడు లభించిన 3.4 మిలియన్  డాలర్లు ఇలా అన్ని కలుపుకొని నికేష్‌ అరోరా నెట్‌వర్త్‌ ఇప్పుడు సుమారు 1.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. కాగా అరోరా 2023లో దాదాపు 300 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను విక్రయించినట్లు నివేదిక పేర్కొంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో అరోరా గతేడాది అందుకున్న పరిహారంలో అత్యధికంగా 7.5 లక్షల స్టాక్‌లు ఉన్నాయి. వీటి విలువ ప్రస్తుతం 220 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)