Breaking News

ఉద్యోగం ఊడింది.. మంచికే అయింది!

Published on Fri, 05/23/2025 - 11:04

గూగుల్‌ కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత తన జీవనశైలి మెరుగైందని ఆ సంస్థ మాజీ ఉద్యోగి తెలిపారు. షావో చున్‌ చెన్‌(39) సింగపూర్‌లోని గూగుల్‌ కార్యాలయంలో ఉద్యోగం చేసేవారు. కొన్ని కారణాలతో ఫిబ్రవరి 2024లో సంస్థ తనను తొలగించింది. చెన్ తన గూగుల్ కార్యాలయంలో వారానికి 40 గంటలకు పైగా పనిచేసేవారు.

ఉద్యోగం పోయిన తర్వాత సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్ లెక్చరర్‌గా చేరారు. అక్కడ వారానికి మూడు గంటలు మాత్రమే పనిచేస్తున్నాడు. థాయ్‌లాండ్‌లో ఉంటున్న 39 ఏళ్ల చెన్‌ ప్రతి వారం సింగపూర్‌కు విమానంలో ప్రయాణం చేస్తూ ఉద్యోగాన్ని సాగిస్తున్నాడని చెప్పాడు. తాను కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నట్లు తెలిపాడు. వారానికి మూడు గంటల పాటు డిజిటల్ మార్కెటింగ్ క్లాసు బోధిస్తూ నెలకు 2,000 నుంచి 4,000 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.1.33 లక్షల నుంచి రూ.2.6 లక్షలు) సంపాదిస్తున్నాని చెప్పాడు. ఈ డబ్బు తన ప్రయాణాలకు, థాయ్‌లాండ్‌లో తన కుటుంబ ఖర్చులకు సరిపోతుందని చెన్ చెప్పారు.

ఇదీ చదవండి: సైబర్‌ మోసాల కట్టడికి ‘ఫ్రాడ్‌ రిస్క్‌ ఇండికేటర్‌’

2024 ఫిబ్రవరిలో గూగుల్ తనను తొలగించిన తర్వాత తాను ఆర్థికంగా స్వతంత్రుడినయ్యానని పేర్కొన్నారు. దాదాపు దశాబ్ద కాలం పాటు గూగుల్‌లో అనవసరంగా సమయం వృథా చేశానని చెప్పారు. అనుకోకుండా కంపెనీ తనను తొలగించడంతో మంచే జరిగిందన్నారు. ఇకపై ఎక్కువ కాలం జీతంపై ఆధారపడాల్సిన అవసరం లేదని గ్రహించినట్లు తెలిపారు. ఇప్పటికే చెన్‌ ఇతర మార్గాల ద్వారా సమకూరిన డబ్బుతో సుమారు 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.17 కోట్లు) పోర్టఫోలియోను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్ర​స్తుతం అసిస్టెంట్ లెక్చరర్‌గా చేస్తూనే యూట్యూబ్‌లో ఎడ్యుకేషనల్ కంటెంట్, కోచింగ్ బిజినెస్ ద్వారా కూడా తాను డబ్బు సంపాదిస్తున్నానని తెలిపారు. ఆన్‌లైన్‌ కోచింగ్‌ ద్వారా గంటకు 500 డాలర్లు (సుమారు రూ.43,000) ఆర్జిస్తున్నట్లు పేర్కొన్నారు.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)