Breaking News

వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3

Published on Mon, 05/06/2024 - 10:13

ఒక్క మాటలో చెప్పాలంటే ఫారం 1,2 .. జీతం మీద ఆదాయం వచ్చిన వారే వేయాలి. మిగిలిన ఫారాలు ఏవి కూడా వేతన జీవులకు వర్తించవు. ఈ ఫారం–3, అలాగే ఇక నుంచి వచ్చే ఫారాలు వ్యాపారం లేదా వృత్తి మీద ఆదాయం ఉన్న వారికే వర్తిస్తాయి. ఫారం–3ని వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు వాడాలి.

  • ఇది చాలా పెద్ద ఫారం అని చెప్పవచ్చు. నిడివిపరంగా అనడం లేదు.. ఇవ్వాల్సిన వివరాలు ఎక్కువ..సంఖ్య ఎక్కువ.

  • వ్యక్తులు, హిందు ఉమ్మడి కుటుంబాలు వేయొచ్చు.

  • ముఖ్యమైన రూలు ఏమిటంటే వ్యాపారం / లేదా వృత్తి మీద ఆదాయం ఉన్నవారు మాత్రమే ఫారం–3ని వేయాలి.

  • ఆదాయపు పన్ను చట్టప్రకారం వ్యాపారానికొక రకమైన ఫారం, వృత్తి నిపుణులకొక రకమైన ఫారం లేదు. అందరికీ ఒకే ఫారం.

  • ‘వ్యాపారం’ అనే పదానికి నిర్వచనంలోనే ఎన్నో వాటితో పాటు ‘వృత్తి’ని కలిపారు.

  • వ్యక్తులు/కుటుంబాలకు ట్యాక్స్‌ ఆడిట్‌ వర్తించినా, వర్తించకపోయినా ఈ ఫారం వేయాలి.

  • ఈ రిటర్నులో ఇంటి మీద ఆదాయం, జీతం, పెన్షన్, వ్యాపారం/వృత్తి మీద ఆదాయం, ఇతర ఆదాయాలు, మూలధన లాభాలు.. అంటే చట్టంలో పొందుపర్చిన అన్నీ.. అంటే ఐదు శీర్షికల్లో ఏర్పడ్డ ఆదాయం ఉన్నవారు వేయొచ్చు.

  • భాగస్వామ్యం నుంచి పారితోíÙకం వచ్చే వారు వేయొచ్చు.

  • దీన్ని ‘మాస్టర్‌ ఫారం’ అని అనొచ్చు. ఎందుకంటే, వ్యక్తి లేదా ఉమ్మడి కుటుంబం ప్రతి ఆదాయం.. ఇండియాలో వచ్చినది కావొచ్చు విదేశాల నుంచి వచ్చినది కావొచ్చు.. ‘సర్వం’ ఇందులో కవర్‌ అవుతుంది.

  • అంతే కాకుండా, ఆదాయం కానివి.. ఉదాహరణకు, అడ్వాన్సులకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాలి.

  • ఆ ఆర్థిక సంవత్సరంలో జరిగిన పెద్ద లావాదేవీలు, ఇండియాలో గానీ విదేశాల్లో గానీ జరిగినవి ఇవ్వాలి.

  • అలాగే, మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ల వివరాలు ఇవ్వాలి. ఈ ఇన్వెస్ట్‌మెంట్ల వల్ల ఆదాయం ఏర్పడకపోయినా వివరాలు ఇవ్వాలి. ఉదాహరణగా ఒక ఇంటి కోసం భారీ మొత్తాన్ని అడ్వాన్సుగా ఇచ్చారు. ఇలాంటి వ్యవహారాలన్నింటిని కూడా పొందుపర్చాలి.

  • కొంత నిర్దేశించిన టర్నోవరు దాటిన వారే అకౌంట్స్‌ బుక్స్‌ రాయాలి. కానీ మా సలహా ఏమిటంటే.. వ్యాపారం/వృత్తి ఉన్నవారు అకౌంట్స్‌ రాయండి. వ్యవహారం జరిగినప్పుడు స్పష్టంగా సమగ్రంగా అన్నీ ఒక చోట పర్మనెంట్‌ బుక్‌లో రాసుకోండి. వివరణ రాయండి.

    ఇలా రాసి ఉంచడం మీకు కాస్తంత శ్రమ కావచ్చు కానీ, తర్వాత రోజుల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఫారం నింపడానికి / దాఖలు చేయడానికి అవసరమైతే వృత్తి నిపుణుల సర్వీసులు తీసుకోండి.

    - కె.సీహెచ్‌, ఎ.వి.ఎస్‌.ఎన్‌ మూర్తి, - కె.వి.ఎన్‌ లావణ్య, ట్యాక్సేషన్‌ నిపుణులు

    ఇవి చదవండి: రూ. 27 లక్షల కోట్లకు గృహ రుణాలు..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)