Breaking News

‘డాలర్‌’కు భారత్‌ అంటేనే ఇష్టం..!

Published on Sat, 12/23/2023 - 09:21

నిరంతర వాణిజ్యం, కరెంట్ ఖాతా లోటు సమర్థంగా నిర్వహించడానికి ఐటీ రంగం కీలకంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఐటీ ఎగుమతులు మందగిస్తే దేశ ఫారెక్స్‌ నిల్వలు తరిగి అది రూపాయి విలువపై ప్రభావం చూపనుంది. ఐటీ రంగం పెద్ద మొత్తంలో ఫారెక్స్ ఆదాయాన్ని తీసుకురావడమే కాదు.. ఇతర ఎగుమతి ఆధారిత రంగాలతో పోలిస్తే ఇందులో ఫారెక్స్‌ వ్యయాలు కూడా తక్కువ. ఐటీ కంపెనీల ఫారెక్స్ ఖర్చులు వాటి ఎగుమతి ఆదాయంలో సగం కంటే తక్కువ ఉంటుందని అంచనా. మరోవైపు కార్పొరేట్ రంగంలో అతిపెద్ద ఎగుమతిదారులుగా ఉన్న ఆయిల్‌ అండ్‌ గ్యాస్, మైనింగ్ కంపెనీల ఫారెక్స్ ఖర్చులు వాటి ఫారెక్స్‌ ఆదాయాలను మించిపోతాయి. 

ఇటీవల స్టాక్‌మార్కెట్లు బాగా పుంజుకోవడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా భారత్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా మార్కెట్‌ సూచీలు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. ప్రధానంగా అమెరికాకు చెందిన ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ జెరొమ్‌పావెల్‌ కీలక వడ్డీరేట్లపై ఇటీవల చేసిన ప్రకటన మార్కెట్‌లకు దన్నుగా నిలుస్తోంది. దాంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఎప్పటినుంచో అనిశ్చితి కొనసాగుతున్న ఐటీ స్టాక్‌లు భారీగా ర్యాలీ అవుతున్నాయి. ఐటీ కంపెనీలు అధికంగా డాలర్లలోనే వ్యాపారం సాగిస్తాయి. దాంతో భారత్‌లోని టాప్‌ కంపెనీల్లో ఎఫ్‌ఐఐలు అధికంగా పెట్టుబడి పెట్టడంతో దేశంలోని ఫారెక్స్‌ నిలువలు పెరిగినట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. 

దేశంలోని విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు పెరిగాయి. ఈ నెల 15వ తేదీ కంటే ముందు వారానికి 9.11 బిలియన్ డాలర్లు(రూ.75 వేలకోట్లు) పెరుగుదలతో 615.97 బిలియన్ డాలర్లకు(రూ.51.2 లక్షల కోట్లు) ఫారెక్స్ నిల్వలు పెరిగాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. ఈ నెల 8వ తేదీ కంటే ముందు వారానికి ఫారెక్స్ నిల్వలు 2.82 బిలియన్ డాలర్లు(రూ.23 వేలకోట్లు) పుంజుకుని 606.86 బిలియన్ డాలర్లకు(రూ.50.5 లక్షల కోట్లు) చేరుకున్నాయి.

విదేశీ కరెన్సీ నిల్వలు 8.35 బిలియన్ డాలర్లు(రూ.68 వేలకోట్లు) పెరిగి 545.05 బిలియన్ డాలర్ల(రూ.45 లక్షల కోట్లు) వద్దకు చేరాయి. బంగారం నిల్వలు 446 మిలియన్ డాలర్ల(రూ.3700 కోట్లు) పెరుగుదలతో 47.58 బిలియన్ డాలర్లు(రూ.4 లక్షల కోట్లు), స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 135 మిలియన్ డాలర్ల(రూ.1100 కోట్లు) నుంచి 18.32 బిలియన్ డాలర్లకు(రూ.1.5 లక్షల కోట్లు) పుంజుకున్నాయి.

ఇదీ చదవండి: రాష్ట్రాలకు రూ.72,961 కోట్లు విడుదల.. ఎందుకంటే..

ఐఎంఎఫ్‌లో ఫారెక్స్ నిల్వలు 181 మిలియన్ డాలర్లు పెరిగి 5.02 బిలియన్ డాలర్లకు(రూ.41 వేల కోట్లు) చేరాయి. 2021 అక్టోబర్‌లో భారత ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ల డాలర్ల(రూ.53 లక్షల కోట్లు) ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోతున్నపుడు ఆర్‌బీఐ బహిరంగ మార్కెట్‌లో డాలర్లను విక్రయిస్తూ రూపాయి విలువ మరింత పడిపోకుండా ఆదుకుంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)