Breaking News

రూ. 2.18 లక్షల కోట్లు: విదేశీ ఇన్వెస్టర్లు తెగ కొనేస్తున్నారు

Published on Sat, 10/07/2023 - 10:29

హైదరాబాద్‌: అంతర్జాతీయ పెట్టుబడిదారులకు స్థిరాస్తి రంగం హాట్‌కేక్‌లా మారింది. దీంతో దేశీయ స్థిరాస్తి రంగంలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తు తున్నాయి. పెట్టుబడి లావాదేవీలలో పారదర్శకత, విధానపరమైన సంస్కరణలు, వ్యాపారాలకు ప్రోత్సాహం, పారిశ్రామిక రంగంలో సాంకేతికత వంటివి ఇన్వెస్టర్ల ఆకర్షణకు ప్రధాన కారణాలని కొలియర్స్‌ నివేదిక వెల్లడించింది. 

2017-22 మధ్య కాలంలో దేశీయ స్థిరాస్తి రంగంలోకి 32.9 బిలియన్‌ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. అదే 2011-16 మధ్య కాలంలో అయితే 25.8 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడుల (ఎఫ్‌ఐఐ) వాటా 2017-22 మధ్య కాలంలో రూ.2.18 లక్షల కోట్లు (26.6 బిలియన్‌ డాలర్లు), కాగా.. 2011-16లో కేవలం 8.2 బిలియన్‌ డాలర్లు మాత్రమే. గత ఆరేళ్ల కాలంతో పోలిస్తే 2017-22లో విదేశీ సంస్థాగత పెట్టుబడులు మూడు రెట్లు అధికంగా వచ్చాయని కొలియర్స్‌ ఇండియా నివేదిక వెల్లడించింది.  

ఈ విదేశీ సంస్థాగత పెట్టుబడులలో 70 శాతం అమెరికా, కెనడా దేశాల నుంచే వచ్చా యి. యూఎస్‌ నుంచి 11.1 బిలియన్‌ డాల ర్లు, కెనడా నుంచి 7.5 బిలియన్‌ డాలర్లు, సింగపూర్‌ నుంచి 6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మన దేశంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర కారణాలతో అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)