భారీగా తగ్గిన వెండి.... దూసుకుపోతున్న బంగారం.. ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?
Breaking News
అమెరికన్ కంపెనీ భారీ రీకాల్!
Published on Tue, 02/24/2026 - 16:50
ఇటీవల దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలకు రీకాల్ జారీ చేస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికన్ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ భారీ రీకాల్ ప్రకటించింది. దీని ప్రభావం ఏకంగా 4,12,774 వాహనాల మీద పడింది. ఈ విషయాన్ని యూఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
రియర్ సస్పెన్షన్ టో లింక్‌లలో సమస్య ఉండటం వల్లనే కంపెనీ ఈ భారీ రీకాల్ ప్రకటించింది. ప్రభావిత వాహనాలకు పరిష్కారంగా డీలర్లు టో లింక్‌లను ఉచితంగా భర్తీ చేయాలని రెగ్యులేటర్ సూచించింది. అంతే కాకుండా.. బ్యాటరీ వైఫల్యాలు & బ్రేక్ పెడల్స్లోని లోపాల కారణంగా ఫోర్డ్ అమెరికాలో మరో 40,655 వాహనాలకు రీకాల్ జారీ చేసింది.
భారత్‌కు ఫోర్డ్ కంపెనీ
అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్.. తమిళనాడులోని చెన్నై ప్లాంట్‌లో తయారీ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేసింది.
ఫోర్డ్ కంపెనీ మరైమలై నగర్ ప్లాంట్‌లో నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్ తయారీకి కొత్త లైన్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది నాలుగు సంవత్సరాల విరామం తర్వాత.. భారతదేశంలో ఉత్పత్తికి పునరాగమనాన్ని సూచిస్తుంది. ఒప్పందం ప్రకారం.. ఫోర్డ్ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం రూ.3,250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించిన తరువాత 600 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, అనేక పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సంస్థకు చెందిన కొత్త సౌకర్యంలో సంవత్సరానికి 2,35,000 ఇంజిన్లను ఉత్పత్తి చేయనుంది. ఈ ఉత్పత్తి 2029లో ప్రారంభం కానుంది. కాగా ఇక్కడ ఉత్పత్తి చేసిన ఇంజిన్లను కంపెనీ.. ఎగుమతి చేయనుంది. కాబట్టి ఇవన్నీ గ్లోబల్ మార్కెట్లకు అనుగుణంగా ఉంటాయి.
Tags : 1