Breaking News

‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’

Published on Wed, 07/02/2025 - 14:38

పదేళ్లకు పైబడిన డీజిల్ వాహనాలపై నిషేధం విధించడంతో తాను అత్యంత జాగ్రత్తగా ఉపయోగించే రేంజ్‌ రోవర్‌ను తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోందని ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పాత వాహనాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఢిల్లీ ఎండ్‌ ఆఫ్‌ లైఫ్‌(ఈఓఎల్‌) పాలసీ ప్రకారం డీజిల్‌ వాహనాల జీవితకాలాన్ని 10 ఏళ్లుగా, పెట్రోల్‌ వాహనాలకు 15 ఏళ్లుగా నిర్ణయించింది. దాంతో నిర్ణీత సమయం దగ్గర పడుతున్న వాహనాలను వాహనదారులు ఢిల్లీ ఎన్‌సీఆర్‌ వెలుపల నివసిస్తున్న వారికి విక్రయించాల్సి వస్తుంది.

రితేష్ గండోత్రా అనే వ్యక్తి తాను రూ.లక్షలుపోసి కొనుగోలు చేసిన రేంజ్‌ రోవర్‌ కారును ఢిల్లీ ఈఓఎల్‌ నిబంధనలను అనుగుణంగా చౌకగా అమ్మాల్సి వస్తుందని ఎక్స్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలు విలువ చేసే కారును ఇలా అమ్మకాన్ని పెడుతుండడంతో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘నేను రేంజ్‌ రోవర్‌ కారు కొనుగోలు చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇది డీజిల్ వేరియంట్‌. చాలా జాగ్రత్తగా ఉపయోగించాను. ఇప్పటివరకు కారులో కేవలం 74,000 కిలోమీటర్లే తిరిగాను. కొవిడ్ సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా రెండేళ్ల పాటు ఏమీ వాడలేదు. ఇంట్లో పార్క్‌ చేసే ఉంచాను. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా కారుకు లైఫ్‌ ఉంది. ఎన్‌సీఆర్‌లో 10 సంవత్సరాల డీజిల్ వాహనాల నిషేధ నియమాలకు ధన్యవాదాలు. నా కారును విక్రయించవలసి వస్తుంది. అది కూడా ఎన్‌సీఆర్‌ వెలుపల కొనుగోలుదారులకు తక్కువ రేటుకే ఇవ్వాలి. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేస్తే 45 శాతం జీఎస్టీ+ సెస్ విధిస్తారు. ఇది మంచి విధానం కాదు. బాధ్యతాయుతమైన యాజమాన్యానికి విధించే శిక్ష’ అని రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: ‘మానవుల మాదిరిగా వాస్తవాలు తెలుసుకోదు’

రితేశ్‌ పోస్ట్‌కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఢిల్లీలో వాహనాలు కొనుగోలు చేసేందుకు ముందుగా 15 ఏళ్లపాటు రోడ్‌ ట్యాక్స్‌ కట్టించుకున్నారు. మిగతా 5 ఏళ్ల ట్యాక్స్‌ రిటర్న్‌ ఇవ్వమని అడగాలి’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. ఇంకొంకరు ‘మీరు కారు ఏ ధరకు అమ్ముతారో చెప్పండి సర్‌’ అంటూ స్పందించారు.

#

Tags : 1

Videos

వెండిలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయా?

Annamayya District: ఈజీ మనీ కోసం దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠా

దిగొచ్చిన కూటమి సర్కార్

YS జగన్ టూర్ ను అడ్డుకోవడానికే పోలీసు వ్యవస్థ ఉందా..?: అంబటి

అంక్షల కంచెలు దాటుకుని వచ్చిన భారీగా తరలివచ్చిన అభిమానులు

మామిడిని రాష్ట్రప్రభుత్వమే కొనుగోలు చేయాలి: YS జగన్

పోలీసులు ఎలా కొట్టారంటే.. దాడిపై కార్యకర్త షాకింగ్ నిజాలు

జగన్ వచ్చాడంటే ఎలా ఉంటుందో చూసావా.. నీ 2 వేల మంది పోలీసులు..

బాబు కుంభకర్ణుడి నిద్ర లేపడానికే వేల మంది రైతులు వచ్చారు

జగనన్న కోసం బారికేడ్లు బద్దలు కొట్టుకొని వచ్చాం

Photos

+5

గ్రాండ్‌గా డ్రమ్స్‌ శివమణి కుమారుడి వెడ్డింగ్ (ఫొటోలు)

+5

బంగారుపాళ్యం వీధుల్లో జనసునామీ (ఫొటోలు)

+5

బతుకమ్మకుంటకు జీవం పోసిన హైడ్రా.. నాడు అలా.. నేడు ఇలా (ఫొటోలు)

+5

శ్రీనారాయణపురం జలపాతాలు : మర్చిపోలేని అనూభూతిని ఇచ్చే పర్యాటక ప్రదేశం..!

+5

హీరో సిద్ధార్థ్‌ ‘3BHK’ మూవీ థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

'ఓ భామ అయ్యో రామ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు (ఫొటోలు)

+5

విదేశాల్లో ఘనంగా వైఎస్సార్ జయంతి (ఫొటోలు)

+5

తేజస్వీ సూర్య శివశ్రీ స్కంద దంపతుల ఇంట్లోకి అందమైన అతిథి (ఫొటోలు)

+5

కొరియా సినిమాకు ఒక్క మగాడు (ఫొటోలు)