Breaking News

ఆవిష్కరణ.. ఆహార వ్యర్థాలతో కోట్ల రూపాయలు

Published on Mon, 10/20/2025 - 16:38

ఆహార పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఆహార ఉత్పతుల నుంచి వచ్చే వ్యర్థాలు దేనికీ పనికిరాకుండా ఉండేవి.  టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఉపఉత్పత్తులను(Byproducts) విలువైన, లాభదాయకమైనవిగా కొన్ని కంపెనీలు మారుస్తున్నాయి. ఈ విభాగంలో కంపెనీలు వినూత్నంగా ఆలోచించి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాయి. ఇవి ఆహార నష్టాన్ని తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, లాభదాయకమైన వ్యాపార అవకాశాలకు మార్గం చూపుతున్నాయి.

పండ్ల వ్యర్థాల నుంచి..

సింగపూర్‌లోని డోల్ స్పెషాలిటీ ఇంగ్రీడియెంట్స్ వంటి కంపెనీలు అరటి, పైనాపిల్ తొక్కల వ్యర్థాలను వినూత్నంగా ఉపయోగిస్తున్నాయి. ఈ తొక్కల నుంచి ఎంజైమ్‌లు, నూనెలు, ఫైబర్స్ వంటి విలువైన ఉత్పత్తులను సేకరిస్తున్నారు. ఉదాహరణకు, అరటి ఫైబర్ పౌడర్‌ను బిస్కెట్లు, తృణధాన్యాల్లో వాడుతున్నారు. కొన్ని రకాల ఫైబర్‌లను వస్త్ర పరిశ్రమలో తిరిగి వినియోగిస్తున్నారు.

సీఫుడ్ వ్యర్థాల వినియోగం

చేపల పొలుసులు, తలలు, ఇతర ఉపఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా ఒమేగా-3-రిచ్ ఫిష్ ఆయిల్ వంటి అధిక విలువ కలిగిన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇది ఆహార పదార్థాలు, క్రియాత్మక ఆహారాల విభాగంలో డిమాండ్‌ను అందుకోవడంతో పాటు వ్యర్థాలను తగ్గించి లాభదాయకమైన ఆదాయ వనరులను సృష్టిస్తుంది.

బ్రేవరీ వ్యర్థాలతో ఇలా..

బెంగళూరుకు చెందిన సేవింగ్ గ్రెయిన్స్ వంటి సంస్థలు బ్రేవరీల నుంచి మిగిలిపోయిన ధాన్యాలను (Spent Grains) సేకరించి వాటితో రుచి, ఫైబర్, పోషకాలు సమృద్ధిగా ఉన్న ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.

అప్‌సైకిల్‌

జైపూర్‌లోని ది మిస్ఫిట్స్ వంటి సంస్థలు సాధారణంగా మార్కెట్‌లో కొనుగోలుదారులు తిరస్కరించే పండ్లు, కూరగాయలను డిప్స్, జామ్‌లుగా అప్‌సైకిల్ చేస్తున్నాయి. దీని ద్వారా ఆహార నష్టాన్ని పరిష్కరిస్తున్నాయి.

షెల్ఫ్ లైఫ్‌ పొడిగింపు

ఆహార వ్యర్థాలను అప్‌సైక్లింగ్ చేయడంతో పాటు ఉత్పత్తులు పాడవకుండా అరికట్టడం మరొక ముఖ్యమైన అంశం. చెన్నైలోని గ్రీన్‌పాడ్ ల్యాబ్స్ వంటి స్టార్టప్‌లు పండ్లు, కూరగాయల షెల్ఫ్ జీవితాన్ని పొడిగించడానికి సహజ మొక్కల సారాలను ఉపయోగిస్తున్నాయి. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహారంలో దాదాపు 40% వృధా అవుతున్న నేపథ్యంలో ఇటువంటి ఆవిష్కరణలు ఆహార నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఇదీ చదవండి: దీపావళి కానుక.. బ్యాంకులు అదిరిపోయే ఆఫర్లు..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)