Breaking News

ఎఫ్‌ఎంసీజీ ఆదాయాల్లో 9 శాతం వృద్ధి

Published on Sat, 07/06/2024 - 08:37

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం మధ్య పెరగొచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ తెలిపింది. అధిక అమ్మకాల పరిమాణానికి తోడు గ్రామీణ మార్కెట్లు కోలుకోవడాన్ని ప్రస్తావించింది. పట్టణాల్లోనూ అమ్మకాలు 7–8 శాతం మేర పెరుగుతాయని, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధికితోడు, ప్రీమియం ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ అధిక విక్రయాలకు తోడ్పడొచ్చని అంచనా వేసింది. 

ప్రీమియం ఉత్పత్తుల వినియోగ ధోరణి, అమ్మకాల్లో వృద్ధి ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమల నిర్వహణ మార్జిన్ల విస్తరణకు తోడ్పడతాయని.. మొత్తం మీద నిర్వహణ మార్జిన్లు 50–75 బేసిస్‌ పాయింట్లు పెరిగి 20–21 శాతానికి చేరుకోవచ్చని క్రిసిల్‌ అంచనా వేసింది. ‘‘మార్జిన్ల విస్తరణ అధికంగానే ఉంటుంది. కానీ మార్కెటింగ్‌ వ్యయాలు పెరగడం, సంఘటిత, అసంఘటిత రంగంలోని సంస్థల మధ్య అధిక పోటీ నెలకొనడం దీన్ని పరిమితం చేస్తుంది’’అని వివరించింది.

 ఫుడ్, బెవరేజెస్‌ విభాగంలో(ఎఫ్‌అండ్‌బీ) ముడి సరుకుల ధరలు పెరగడం మార్జిన్ల విస్తరణను పరిమితం చేస్తున్నట్టు తెలిపింది. అదే సమయంలో వ్యక్తిగత, గృహ సంరక్షణ విభాగంలో కీలక ముడి సరుకుల ధరలు స్థిరంగానే ఉన్నాయని పేర్కొంది. ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ ఆదాయంలో సగం ఫుడ్, బెవరేజెస్‌ నుంచే వస్తుండగా, వ్యక్తిగత సంరక్షణ, గృహ సంరక్షణ చెరో పావు శాతం వాటా కలిగి ఉన్నట్టు క్రిసిల్‌ గుర్తు చేసింది. ప్రీమియం ఉత్పత్తులను ఎక్కువగా ఆవిష్కరించడం, ముఖ్యంగా ఫుడ్, బెవరేజెస్, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో తీసుకురావడం కంపెనీల మార్జిన్లకు మద్దతునిచ్చే అంశంగా పేర్కొంది.  

ఆహారం, పానీయాల్లో ఎక్కువ వృద్ధి 
ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ ఆదాయంలో వృద్ధి అన్నది విభాగాల వారీగా భిన్నంగా ఉంటుందని క్రిసిల్‌ రేటింగ్స్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ రవీంద్ర వర్మ తెలిపారు. ‘‘ఫుడ్, బెవరేజెస్‌ (ఎఫ్‌అండ్‌బీ) విభాగంలో ఆదాయాలు 8–9 శాతం మేర పెరగొచ్చు. వ్యక్తిగత సంరక్షణ విభాగంలో ఇది 6–7 శాతం మధ్య ఉంటుంది. గృహ సంరక్షణ ఉత్పత్తుల నుంచి ఆదాయం 8–9 శాతం మేర పెరగొచ్చు’’అని వర్మ తెలిపారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)