Breaking News

భారత్‌లో పెట్టుబడులు పెట్టండి

Published on Wed, 04/23/2025 - 04:32

శాన్‌ఫ్రాన్సిస్కో: భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు భారీ అవకాశాలు ఉన్నాయని ఐటీ దిగ్గజాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. సాంకేతిక సహకారం, ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా పర్యటన సందర్భంగా గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్, ట్యూరింగ్‌ సీఈవో జొనాథన్‌ సిద్ధార్‌్థ, డేటా రోబో సీఈవో దేబాంజన్‌ సాహా తదితరులతో మంత్రి సమావేశమయ్యారు. మేకిన్‌ ఇండియా నినాదం కింద భారత్‌తో పాటు ప్రపంచ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఇక్కడ టెక్నాలజీని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని థామస్‌ కురియన్‌ బృందాన్ని ఆమె కోరారు.

భారత ఏఐ మిషన్‌ను ఈ సందర్భంగా కురియన్‌ ప్రశంసించారు. మరోవైపు, సిద్ధార్‌్థతో సమావేశంలో కృత్రిమ మేథకు సంబంధించి భారత్‌ పాలసీలను మంత్రి వివరించారు. ఏఐ విభాగంలో భారతీయ సంస్థలతో కలిసి పనిచేయడంపై సిద్ధార్థ్‌ ఆసక్తి వ్యక్తం చేసినట్లు ఎక్స్‌లో ఆర్థిక శాఖ పోస్ట్‌ చేసింది. కృత్రిమ మేథలో సూపర్‌పవర్‌గా ఎదిగే సత్తా భారత్‌కి ఉందని, ఏఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో తాము కూడా భాగం కావాలని భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌కి దేబాంజన్‌ సాహా తెలిపారు. అటు వివిధ పెన్షన్‌ ఫండ్‌ మేనేజర్లు, ఇతరత్రా సంస్థాగత ఇన్వెస్టర్లతో రౌండ్‌టేబుల్‌ కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొన్నారు. ఇంధన రంగం, పర్యావరణహిత ప్రాజెక్టులు, గిఫ్ట్‌–ఐఎఫ్‌ఎస్‌సీ మొదలైన వాటిల్లో పెట్టుబడులు, భాగస్వామ్యాలకు ఉన్న అవకాశాలను ఆమె వివరించారు. 

సంస్కరణల దన్ను.. 
వచ్చే రెండు దశాబ్దాల పాటు నిలకడగా వృద్ధి సాధించడమనేది సాహసోపేత సంస్కరణలతో పాటు దేశీయంగా సామర్థ్యాలను పెంపొందించుకోవడంపై ఆధారపడి ఉంటుందని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులను దీటుగా ఎదుర్కొనే విధంగా సంస్థల మధ్య భాగస్వామ్య ఒప్పందాలు ఉండటం కూడా కీలకమని హూవర్‌ ఇనిస్టిట్యూషన్‌లో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె తెలిపారు.

గత దశాబ్దకాలంగా ప్రభుత్వం పలు నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టిందని, 20,000 పైగా నిబంధనలను సరళీకరించడంతో పాటు వ్యాపార చట్టాల్లో క్రిమినల్‌ సెక్షన్లను తగ్గించిందని, ప్రభుత్వ సర్విసులను డిజిటలీకరించిందని మంత్రి పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేయడంతో పాటు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంపొందించడం ద్వారా తయారీ రంగ ఆధారిత వృద్ధికి బాటలు వేసినట్లు వివరించారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లయ్యే 2047 నాటికి సంపన్న దేశంగా ఎదగాలని భారత్‌ నిర్దేశించుకుందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను విస్మరించకుండా దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)