Breaking News

‘ఫ్లోరా’ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ దీని ప్రత్యేక ఏంటో తెలుసా?

Published on Sun, 10/01/2023 - 13:10

ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎయిర్‌ ప్యూరిఫైయర్లకు పూర్తిగా భిన్నమైన ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ ఇది. పచ్చదనానికి లోటు రాకుండా, గాలిని ఇట్టే పరిశుభ్రం చేసేస్తుంది. చాలా ఎయిర్‌ ప్యూరిఫయర్ల తయారీలో ప్లాస్టిక్, లోహాలను విరివిగా వాడతారు. అమెరికన్‌ కంపెనీ ‘ఫ్లోరా’ మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ మాత్రం సహజసిద్ధమైన పదార్థాలతోనే తయారు కావడం విశేషం.

దీని తయారీలో అత్యధిక భాగం కలప, గాజు, సిరామిక్‌ వంటి ప్రకృతికి హాని కలిగించని పదార్థాలనే వాడారు. దీని లోపలిభాగంలో నిత్యం పచ్చగా ఉండే సజీవమైన సముద్రపు నాచును ఉపయోగించారు. ఇది రెండంచెల్లో గాలిని శుభ్రం చేస్తుంది.

ఒక అంచెలో నాచు, మరో అంచెలో ఇందులో కొబ్బరిపీచుతో ఏర్పాటు చేసిన కార్బన్‌ ఫిల్టర్‌ గాలిలోని సూక్ష్మకణాలను పూర్తిగా తొలగిస్తాయి. ఇందులో బెడ్‌లైట్‌కు సరిపోయే బల్బును కూడా అమర్చడంతో గదిలో ఒక మూల పెట్టుకుంటే, ఇంటి అలంకరణకే వన్నె తెచ్చేలా కనిపిస్తుంది. దీని ధర 141.85 డాలర్లు (రూ.11,806) మాత్రమే! 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)