Breaking News

FlixBus: భారత్‌లోకి జర్మనీ బస్సులు.. ఎక్కడికైనా రూ.99 టికెట్‌!

Published on Sat, 02/03/2024 - 20:48

జర్మనీ రవాణా సంస్థ ఫ్లిక్స్‌బస్‌ (FlixBus)భారత్‌లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద అతిపెద్ద బస్ మార్కెట్‌ అయిన భారత్‌లో ప్రయాణికులకు తక్కువ ధరకే మెరుగైన  ఇంటర్‌సిటీ ప్రయాణ అనుభవాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. 

దేశంలో మొదటగా న్యూఢిల్లీ, హిమాచల్, జమ్ము కశ్మీర్‌, పంజాబ్, రాజస్థాన్, యూపీ అంతటా ఉన్న ప్రధాన నగరాలు, మార్గాలను కలుపుతూ ఫ్లిక్స్‌బస్‌ సర్వీసులు నడపనుంది. ఈ బస్సులు ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభం కానున్నాయి. 

టికెట్‌ రూ.99 
లాంచింగ్‌ ఆఫర్‌ కింద ప్రారంభ రూట్‌లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా  రూ. 99 లకే టికెట్‌లు అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. నార్త్‌ ఇండియాలోని ఢిల్లీ నుంచి అయోధ్య, చండీఘర్‌, జైపూర్, మనాలి, హరిద్వార్, రిషికేశ్, అజ్మీర్, కత్రా, డెహ్రాడూన్, గోరఖ్‌పూర్, వారణాసి, జోధ్‌పూర్, ధర్మశాల, లక్నో, అమృత్‌సర్ వంటి అన్ని ప్రముఖ ప్రాంతాలకూ ఈ బస్సులు నడుస్తాయి. ఫ్లిక్స్‌బస్‌ సమగ్ర నెట్‌వర్క్‌లో 59 స్టాప్‌లు, మొత్తం 200 కనెక్షన్‌లు ఉంటాయి.

అన్నీ ప్రీమియం బస్సులు
జర్మనీకి చెందిన ఫ్లిక్స్‌బస్‌ సర్వీస్‌ ప్రత్యేకంగా BS6 ఇంజిన్‌లతో కూడిన ప్రీమియం బస్ మోడల్‌లను నిర్వహిస్తుంది, కఠినమైన ఉద్గార నిబంధనలకు కట్టుబడి పర్యావరణ సుస్థిరతను పెంపొందిస్తుంది. "ఫ్లిక్స్‌బస్‌ను ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద బస్ మార్కెట్‌లలో ఒకటైన భారత్‌కి విస్తరించడం సంతోషిస్తున్నాం. ఇది మాకు 43వ దేశం.  అందరికీ సుస్థిరమైన, సురక్షితమైన, సరసమైన ప్రయాణ ఎంపికలు అందిస్తాం" అని ఫ్లిక్స్‌బస్‌ సీఈవో ఆండ్రీ స్క్వామ్లీన్‌ అన్నారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)