Breaking News

ఉద్యోగుల కడుపు కొట్టేందుకు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్‌!

Published on Mon, 01/08/2024 - 15:12

Flipkart layoffs: ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ వందలాది మంది ఉద్యోగుల కడుపు కొట్టేందుకు సిద్ధమైంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. వ్యయ నియంత్రణ వ్యూహంలో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ పనితీరు ఆధారంగా 5-7 శాతం వర్క్‌ఫోర్స్ తగ్గించేందుకు ప్లాన్ చేస్తోంది. 

ఈ తొలగింపులు మార్చి-ఏప్రిల్ 2024 నాటికి పూర్తవుతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఒక సంవత్సరంపాటు నియామకాలను సైతం ఈ ఈ-కామర్స్‌ దిగ్గజం నిలిపేసింది. ఫ్లిప్‌కార్ట్ గత రెండేళ్లుగా పనితీరు ఆధారంగా ఏటా ఉద్యోగాలను తొలగిస్తూ వస్తోంది.

1500 మందిపై ప్రభావం
మిం​త్రా మినహా కంపెనీ ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య 22,000గా ఉంది. ప్రస్తుతం చేపట్టనున్న తొలగింపులు 1100-1500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపనున్నాయి. కాగా కంపెనీ పునర్నిర్మాణం, 2024కు సంబంధించిన రోడ్‌మ్యాప్‌ వచ్చే నెలలో జరిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో ఖరారవుతాయని నివేదిక సూచిస్తోంది.

ఇదే బాటాలో పేటీఎం, అమెజాన్‌, మీషో వంటి ఇతర సంస్థలు కూడా ఇటీవల వ్యయ నియంత్రణ, పునర్నిర్మాణ చర్యలు చేపట్టాయి. అదానీ గ్రూప్‌నకు 20 శాతం వాటా ఉన్న క్లియర్‌ట్రిప్‌తో సహకారాన్ని కూడా ఫ్లిప్‌కార్ట్ పరిశీలిస్తోంది. ఎయిర్‌లైన్ బుకింగ్‌లపై దృష్టి సారించే క్లియర్‌ట్రిప్‌నకు సంబంధించిన హోటల్ వ్యాపారంలో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడి పెట్టే అవకావం ఉంది. వాల్‌మార్ట్, ఇతర సంస్థల నుంచి సమీకరిస్తున్న 1 బిలియన్ డాలర్ల నిధులు ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక ప్రణాళికలకు మద్దతు ఇస్తాయని అంచనా వేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)