Breaking News

క్విక్‌ కామర్స్‌ విస్తరణలో ఫ్లిప్‌కార్ట్‌

Published on Sun, 12/01/2024 - 07:26

కోల్‌కత: ఈ–కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ క్విక్‌ కామర్స్‌ కార్యకలాపాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. వేగవంతమైన డెలివరీల కోసం వినియోగదారుల నుంచి డిమాండ్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బిగ్‌బాస్కెట్‌ వంటి డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల నుండి పెరుగుతున్న పోటీ నేపథ్యంలో.. ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు కింద బెంగళూరు, ముంబై, ఢిల్లీ రాజధాని ప్రాంతంలో మినట్స్‌ పేరుతో క్విక్‌ కామర్స్‌ సేవలను నిర్వహిస్తోంది.

డాటమ్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక ప్రకారం క్విక్‌ కామర్స్‌ మార్కెట్‌ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది. ఈ రంగం 2024లో 6.1 బిలియన్‌ డాలర్లుగా ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్‌ 70 బిలియన్‌ డాలర్లు ఉంది. ఇది దేశంలోని మొత్తం రిటైల్‌ మార్కెట్‌లో 7 శాతం మాత్రమేనని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.  

ఆన్‌లైన్‌ షాపింగ్‌ జోరు.. 
భారత్‌లో రిటైల్‌ రంగం మొత్తంగా వృద్ధి చెందుతున్నందున ఆన్‌లైన్‌ షాపింగ్‌ గణనీయంగా పెరుగుతుందని  నమ్ముతున్నామని ఫ్లిప్‌కార్ట్‌ చీఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ ఆఫీసర్‌ రజనీశ్‌ కుమార్‌ తెలిపారు. 2028 నాటికి భారత రిటైల్‌ మార్కెట్‌లో దాదాపు 12 శాతం వాటాను ఈ–కామర్స్‌ దక్కించుకుంటుందని గణాంకాలు సూచిస్తున్నాయని వివరించారు.

గ్రామీణ, సెమీ–అర్బన్‌ వినియోగదారుల కోసం కంపెనీ ప్రధాన భారతీయ భాషల్లో యాప్‌ను రూపొందించింది. ఇంగ్లీష్‌ తెలియని కస్టమర్లు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ వేదికగా సుమారు 15 లక్షల మంది వర్తకులు ఉన్నారు. సరఫరా వ్యవస్థలో 3,00,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని కంపెనీ వివరించింది.

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)