Breaking News

రూ.932కే విమాన టికెట్‌

Published on Wed, 09/11/2024 - 08:19

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ ‘ఫ్లాష్ సేల్’ని ప్రారంభించింది. రూ.932కే విమాన టికెట్‌ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ ధర కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే వర్తిస్తుందని చెప్పింది. సెప్టెంబర్ 16, 2024లోపు బుక్‌ చేసుకున్న వారికే ఈ ఆఫర​్‌ అందుబాటులో ఉంటుందని, మార్చి 31, 2025 వరకు చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుందని తెలిపింది.

రూ.932తో ప్రారంభమయ్యే బేస్ ఛార్జీలతో పాటు, వివిధ మార్గాల్లో రూ.1,088 నుంచి టికెట్‌లను విక్రయిస్తోంది. తక్కువ ధరకు ఆఫర్‌ చేసే రూట్లలో ఢిల్లీ-గ్వాలియర్, గౌహతి-అగర్తలా, బెంగళూరు-చెన్నై, కొచ్చి-బెంగళూరు తదితరాలు ఉన్నాయి. airindiaexpress.com ద్వారా తమ టిక్కెట్‌లను బుక్ చేసుకునే కస్టమర్‌లు ప్రత్యేక రాయితీ కలిగిన ‘ఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌ప్రెస్ లైట్’ ఛార్జీలను పొందవచ్చని పేర్కొంది. ఉచితంగా 3 కిలోల కేబిన్‌ బ్యాగేజీని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని చెప్పింది.

ఇదీ చదవండి: రుణాలు పీక్‌... డిపాజిట్లు వీక్‌

చెక్-ఇన్ బ్యాగేజీ ధరలను దేశీయ విమానాల్లో 15 కిలోలకు రూ.1000, అంతర్జాతీయ విమానాల్లో 20 కిలోలకు రూ.1300గా నిర్ణయించారు. విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, వైద్యులు, నర్సులు, సాయుధ దళాల సభ్యులకు సంస్థ ప్రత్యేక తగ్గింపు ధరలు అందిస్తుంది. ఇదిలాఉండగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన విమానాల సంఖ్యను పెంచబోతున్నట్లు గతంలో పేర్కొంది. ప్రతి నెలా దాదాపు నాలుగు కొత్త విమానాలను ప్రారంభిస్తామని తెలిపింది. ఏయిర్‌ ఏషియాతో విలీన ప్రక్రియ ప్రారంభించిన అక్టోబర్ 2023 నుంచి ఇప్పటివరకు 30కి పైగా కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను ప్రవేశపెట్టింది.

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)