Breaking News

తాత్కాలిక ఉద్యోగాలపై పెరుగుతున్న ఆసక్తి

Published on Mon, 03/03/2025 - 19:23

ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌ (తాత్కాలిక, కాంట్రాక్ట్‌ ఆధారిత, నిర్ణీత పనివేళలు లేని... ఉద్యోగశ్రేణి) వృద్ధికి ఫార్మల్‌ స్టాఫింగ్‌ కంపెనీలు మార్గం సుగమం చేస్తున్నాయి. రెగ్యులర్‌ ఉద్యోగేతర.. తాత్కాలిక ఉద్యోగాల స్థితిగతుల గురించి ఇండియన్‌ స్టాఫింగ్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌ఎఫ్‌) వారి ఫ్లెక్సీ ఎంప్లాయ్‌మెంట్‌ సోషల్‌ ఇంపాక్ట్‌ రిపోర్ట్‌ 2024  వెల్లడించింది.

నివేదిక ప్రకారం ఫ్లెక్సీ ఎంప్లాయ్‌మెంట్‌ అనేది మహిళలు, యువత  తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులతో సహా విభిన్న సమూహాలకు సాధికారత కల్పిస్తోంది. అదే సమయంలో శాశ్వత ఉద్యోగ అవకాశాలకు స్పష్టమైన మార్గాలను అందిస్తుంది.. దాదాపు 23% తాత్కాలిక కార్మికులు ఫార్మల్‌ స్టాఫింగ్‌ ఇండస్ట్రీ ద్వారా శాశ్వత ఉద్యోగాలకు మళ్లారు.

ఫ్లెక్సీ వర్కర్లలో 79% మంది మూడు నెలల పాటు అసైన్‌మెంట్‌లలో  ఉన్నారని, 6–12 నెలలు పొడిగించిన కాంట్రాక్టులలో సంవత్సరానికి 40% పెరుగుదల ఉందని నివేదిక వెల్లడించింది.  ఈ మార్పు అనువైన ఉపాధిలో ఎక్కువ స్థిరత్వాన్ని సూచిస్తుంది, ఎందుకంటే ఎక్కువ మంది కార్మికులు దీర్ఘకాలిక అసైన్‌మెంట్‌లను పొందుతారు.

అదనంగా, ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌లో 78% మంది ఆరు నెలలకు మించి కాంట్రాక్ట్‌లలో పాల్గొంటున్నారు. ఇది ఫ్లెక్సీ పనుల దీర్ఘకాలిక ప్రయోజనాలపై పెరుగుతున్న నమ్మకాన్ని సూచిస్తుందని నివేదిక తెలిపింది. 60% తాత్కాలిక కార్మికులు సామాజిక భద్రత, సకాలంలో వేతనాలు, వైద్య కవరేజీ వంటి ప్రయోజనాల ద్వారా ఆకర్షితులవుతారని తేల్చింది. ఈ కార్మికులలో 78% మంది తమ ఉద్యోగ పరిస్థితుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)