విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?
Breaking News
ఎల్‌నినో అంటే భూతం కాదు.. కరువు: సీఎం రేవంత్
iPhone Duo క్రేజీ సేల్ : 5 నిమిషాల్లోనే ఆల్ స్టాక్ అవుట్
ప్రెగ్నెంట్ మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్ : డెలివరీ, శిశువు మృతి
కేఎల్ రాహుల్ అవుట్!.. భారత జట్టులో అతడికి చోటు
ఏపీ హైకోర్టులో వైఎస్సార్సీపీ లంచ్‌మోషన్ పిటిషన్
విడదల రజినీని నెట్టేసిన ఎస్ఐ.. కింద పడ్డ మాజీ మంత్రి!
బరువైన లెహంగా, నగలతో పెళ్లి కూతురి పరుగు : సీఎంకు విజ్ఞప్తి వైరల్
బాబు కుట్రలు.. సాక్ష్యాలతో బయటపెట్టిన వైఎస్ జగన్
ఏపీ రావణ కాష్ఠం.. బాబు సర్కార్ అష్ట కుట్రలు!
సీజేపీకి మద్దతు కాదు.. కేంద్రాన్ని టార్గెట్ చేసిన అన్నామలై!
రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్
వీటిని ఎన్నికలంటారా?: వైఎస్ జగన్
అడ్డగోలు అబద్ధాలు, డ్రామాలు ఎందుకు బాబూ?
ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
ఐపీఎస్ అంకితా శర్మకు బిగ్ షాక్.. ఇలా జరిగిందేంటి?
మాల్దీవుల డబుల్ గేమ్.. భారత్‌కు వెన్నుపోటేనా?
రాష్ట్రపతి, సీజేఐకి ఎంపీ గురుమూర్తి లేఖ
ఈసీలో అంతర్గత పోరు.. కమిషనర్ల ఫిర్యాదుపై కేంద్రం వెనకడుగు!
ఇరాన్ మాస్టర్‌ప్లాన్.. ఎన్నికల వేళ ట్రంప్ ఉక్కిరిబిక్కిరి!
పరాకాష్టకు రెడ్‌బుక్ దాష్టీకాలు.. అవే దౌర్జన్యాలు, దాడులు
వృద్ధి రేటు అంచనాలు పెంచిన ఫిచ్..
Published on Fri, 06/23/2023 - 07:56
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరంలో అంచనాలకు మించి మెరుగుపడుతున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. తయారీ రంగంలో ఉత్పత్తి మెరుగుదల, మౌలిక సదుపాయాల వ్యయంలో స్థిరమైన పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో మార్చిలో వేసిన తొలి 6 శాతం అంచనాలను తాజాగా 6.3 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది. ఈ అంచనా ప్రపంచంలో అత్యధిక వృద్ధి రేటు అని కూడా పేర్కొంది. ఫిచ్ గ్లోబల్ ఎకనమిక్ తాజా అవుట్‌లుక్‌లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
- 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో 6.5 శాతం చొప్పున వృద్ధి నమోదుకావచ్చు.
- బ్యాంకింగ్ భారీ రుణ వృద్ధి, మౌలిక సదుపాయాల వ్యయం నుంచి ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు పొందుతోంది.
- తయారీ రంగంలో రికవరీతోపాటు నిర్మాణ, వ్యవసాయ రంగాలు కూడా పురోగతిలో ఉన్నాయి. ఆయా అంశాలు దేశీయ డిమాండ్‌ను పెంచుతున్నాయి.
- ద్రవ్యోల్బణం భయాలు తొలగుతున్నాయి. తగిన వర్షపాతం అంచనాలు ఉన్నాయి. 2023లో ఆర్‌బీఐ రెపో రేటు (ప్రస్తుతం 6.50 శాతం) యథాతథంలో కొనసాగవచ్చు.
ప్రపంచ వృద్ధి అంచనా పెంపు
కాగా ఊహించినదానికన్నా పరిస్థితులు మెరుగ్గా ఉన్నందున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలను సైతం 2.4 శాతానికి పెంచుతున్నట్లు నివేదిక పేర్కొంది. మార్చిలో ఈ అంచనా 2 శాతం.
#
Tags : 1