Breaking News

భారత్‌ రేటింగ్‌ యథాతథం

Published on Tue, 08/26/2025 - 05:44

న్యూఢిల్లీ: భారత సార్వభౌమ రుణ రేటింగ్‌ను బీబీబీ మైనస్, స్థిరమైన అవుట్‌లుక్‌ వద్దే కొనసాగిస్తున్నట్టు ఫిచ్‌ రేటింగ్స్‌ ప్రకటించింది. బలమైన ఆర్థిక వృద్ధికితోడు పటిష్టమైన విదేశీ మారకం నిల్వలు, విదేశీ రుణ భారం నియంత్రణలో ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుంది. భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) 6.5 శాతంగా ఉండొచ్చన్న తమ అంచనాలను ప్రతిపాదిత 50 శాతం అమెరికా టారిఫ్‌లు ప్రభావితం చేయొచ్చని తెలిపింది.

 గత రెండేళ్లలో వృద్ధి వేగం నిదానించినప్పటికీ పోటీ దేశాలతో పోల్చి చూసినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నట్టు పేర్కొంది. భారత సావరీన్‌ రేటింగ్‌ను ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ఇటీవలే ‘బీబీబీ’కి అప్‌గ్రేడ్‌ చేయగా.. ఫిచ్‌ రేటింగ్స్‌ మాత్రం యథాతధ రేటింగ్‌ను కొనసాగించడం గమనార్హం. ఫిచ్‌ పేర్కొన్న బీబీబీ మైనస్‌ అన్నది పెట్టుబడుల్లో అతి తక్కువ గ్రేడ్‌ రేటింగ్‌. 

మరో రేటింగ్‌ సంస్థ మారి్నంగ్‌ డీబీఆర్‌ఎస్‌ సైతం భారత రేటింగ్‌ను బీబీబీకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్టు ఈ ఏడాది మేలో ప్రకటించింది. రేటింగ్‌ను యథాతథంగా కొనసాగించినప్పటికీ, జీడీపీ వృద్ధి రేటు అంచనా 6.5 శాతంలో ఫిచ్‌ మార్పు చేయలేదు. బలమైన ప్రభుత్వ మూలధన వ్యయాలు, ప్రైవేటు పెట్టుబడులు పుంజుకోవడం, పనిచేయగలిగిన అధిక జనాభా వంటి సానుకూలతలతో మధ్య కాలంలోనూ భారత జీడీపీ 6.4 శాతం వృద్ధిని కొనసాగిస్తుందని ఫిచ్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. 
 
జీఎస్‌టీ తగ్గించడం పాజిటివ్‌: ప్రతిపాదిత జీఎస్‌టీ రేట్ల క్రమబద్ధీకరణతో వినియోగం పెరుగుతుందని ఫిచ్‌ రేటింగ్స్‌ తెలిపింది. వృద్ధి రిస్‌్కలను ఇది కొంత వరకు తగ్గిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా భూమి, కార్మిక చట్టాలకు సంబంధించి కీలక సంస్కరణలకు ఆమోదం ఈ దశలో రాజకీయంగా కష్టమేనని అభిప్రాయపడింది. పలు దేశాలతో ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నప్పటికీ వాణిజ్య అవరోధాలు గణనీయంగానే ఉ న్నట్టు తెలిపింది. బీబీబీ రేటింగ్‌ గల పోటీ దేశాల కంటే భారత్‌కు అధిక ద్రవ్యలోటు, రుణ భారం ఉండడం రేటింగ్‌ పరంగా బలహీనతగా పేర్కొంది. తలసరి ఆదాయం తక్కువగా ఉండడం కూడా రేటింగ్‌ను పరిమితం చేస్తున్నట్టు ఫిచ్‌ రేటింగ్స్‌ వివరించింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)