Breaking News

ఈపీఎఫ్‌వో ఈఎల్‌ఐ స్కీమ్‌కు పటిష్ట వ్యవస్థ

Published on Wed, 07/09/2025 - 19:20

ఉపాధి కల్పన లక్ష్యాల్లో భాగంగా ప్రకటించిన రూ.1.07 లక్షల కోట్ల ఉద్యోగాల ఆధారిత ప్రోత్సాహక (ఈఎల్‌ఐ) స్కీమ్‌ అమలు కోసం డిజిటల్‌ సాధనాలతో పటిష్టమైన వ్యవస్థను కార్మిక శాఖ రూపొందించింది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్‌వో నిర్వహించే సామాజిక భద్రత స్కీముల ద్వారా దీన్ని అమలు చేయనుంది. ఇటు ఉద్యోగులు, అటు సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఈఎల్‌ఐ స్కీమును తీర్చిదిద్దినట్లు కార్మిక శాఖ మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

ప్రయోజనాలను నేరుగా ఖాతాలకు బదిలీ చేసే విధంగా ఇది ఉంటుందని వివరించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన (ఏబీఆర్‌వై) అమల్లో అవినీతి, ఫేక్‌ క్లెయిమ్‌ల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, మళ్లీ అలాంటి ఉదంతాలు చోటు చేసుకోకుండా ఈ స్కీమును పటిష్టంగా తీర్చిదిద్దినట్లు మంత్రి పేర్కొన్నారు. తయారీ రంగంపై ప్రత్యేక దృష్టితో, వివిధ రంగాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగయోగ్యత, సామాజిక భద్రతను పెంపొందించడం ఈఎల్‌ఐ స్కీము ప్రధాన ఉద్దేశం. దీనితో వచ్చే రెండేళ్లలో 3.5 కోట్లకు ఉద్యోగాల కల్పనను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

తొలిసారి ఉద్యోగంలో చేరిన వారికి ఒక నెల వేతనం (రూ.15,000 వరకు) ఈ స్కీము కింద లభిస్తుంది. అదనంగా ఉద్యోగాలను కల్పించనందుకు అటు వ్యాపార సంస్థలకు  రెండేళ్ల పాటు ప్రోత్సాహకాలు లభిస్తాయి. తయారీ రంగానికి మరో రెండేళ్లు అదనంగా ప్రయోజనాలు అందుతాయి. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జూలై 31 వరకు కల్పించే ఉద్యోగాలకు ఈ పథకం వర్తిస్తుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)