Breaking News

యాపిల్ ఫస్ట్ ఇండియన్ యాడ్ ఇదే.. చూశారా?

Published on Mon, 09/09/2024 - 08:48

ఎంతగానో ఎదురు చూస్తున్న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ ఈ రోజు (సెప్టెంబర్ 9) లాంచ్ కానుంది. 'ఇట్స్ గ్లోటైమ్' పేరుతో కాలిఫోర్నియాలోని యాపిల్ కుపెర్టినో పార్క్‌లో జరగనున్న కార్యక్రమంలో ఈ ఫోన్‌ను కంపెనీ చీఫ్ టిమ్ కుక్ ప్రారంభించనున్నారు.

కంపెనీ 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్‌ను ప్రారంభించడానికి ముందే.. యాపిల్ కంపెనీ ఇంటర్నెట్‌లో ఓ వీడియో షేర్ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు సమీర్ సోనీ నటించిన ఈ యాడ్ టెక్ ఔత్సాహికులను, అభిమానులను ఎంతగానో ఆకర్శించింది. ఈ యాడ్ గమనిస్తే.. ఇది ఒక సాధారణ కార్పొరేట్ ఆఫీసులో 1996లో జరిగిన సన్నివేశం అని తెలుస్తోంది.

టీవీ1 ఇండియా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియో షేర్ చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 10 లక్షల కంటే ఎక్కువమంది వీక్షించినట్లు తెలుస్తోంది. దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను గమనిస్తే యాపిల్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.

యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌
యాపిల్ ఈరోజు 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లాంఛ్ అవుతాయని సమాచారం. ఈ ఫోన్స్ 6.1 ఇంచెస్ నుంచి 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే పొందనున్నట్లు.. బ్లూ, గ్రీన్, రోస్, వైట్, బ్లాక్ అనే కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఐఫోన్ 16 ప్రో బ్రౌన్ కలర్ పొందనున్నట్లు సమాచారం. దీనిని డెసర్ట్ టైటానియం అని పిలుస్తారు. దీంతితో పాటు గోల్డ్ కలర్ కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్    

యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌ మైక్రో-లెన్స్ టెక్నాలజీని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.89,900 వరకు ఉండొచ్చని అంచనా. ఐఫోన్ 16 సిరీస్‌ 2x ఆప్టికల్ 48MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌ వంటి వాటిని పొందే అవకాశం ఉంది. ఈ 16 సిరీస్ మోడల్స్ ఏ18 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది ఏఐకు సపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)