ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. కారణం ఇదే!

Published on Mon, 09/25/2023 - 19:53

దేశీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) మీద కాన్పూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం, ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన 'రాజేష్ మిశ్రా' తన కుమారుడు మహీంద్రా కారులో ప్రయాణిస్తూ చనిపోవడంతో ఆనంద్ మహీంద్రా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుర్నానీతో పాటు కంపెనీలోని 11 మంది ఉద్యోగులపై కేసు పెట్టాడు. ఎఫ్ఐఆర్ ప్రకారం తన కొడుకు 'మహీంద్రా స్కార్పియో' (Mahindra Scorpio)లో ప్రయాణించే సమయంలో సీటు బెల్టు ధరించి ఉన్నప్పటికీ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాకపోవడం వల్ల మరణించినట్లు వెల్లడించాడు.

2022 జనవరి 14న తన కొడుకు అపూర్వ్ లక్నో నుంచి కాన్పూర్‌కు తిరిగి వస్తున్న సమయంలో స్కార్పియో ప్రమాదానికి గురైనట్లు, ఈ సమయంలో ఎయిర్ బ్యాగులు ఓపెన్ కాకపోవడం వల్లే మరణించాడని చెప్పుకొచ్చాడు. భద్రతలో స్టార్ రేటింగ్ కలిగిన కారులో ఎయిర్ బ్యాగులు ఎందుకు ఓపెన్ కాలేదని ఆరోపించాడు.

ఇదీ చదవండి: అక్టోబర్ నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎందుకంటే!

ప్రమాదంలో కొడుకు మరణించిన 15 రోజుల తరువాత తాను కారు కొనుగోలు చేసిన డీలర్‌షిప్‌కి వెళ్లి సీటు బెల్టు పెట్టుకున్నా ఎయిర్ బ్యాగ్ తెరుచుకోలేదని వాపోయాడు. ఈ సందర్భంగా ఉద్యోగులు, రాజేష్ మిశ్రా మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తరువాత వీరిపై కేసు నమోదు చేయించాడు. ఆరోపణల మేరకు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఆనంద్ మహీంద్రా ఇంకా స్పందించలేదు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)