Breaking News

విలీనానికి మరో రెండు బ్యాంకులు - డేట్ ఫిక్స్

Published on Mon, 10/30/2023 - 13:01

భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన హొసింగ్​ ఫైనాన్స్​ దిగ్గజం హెచ్​డీఎఫ్​సీ, ప్రైవేట్‌ బ్యాంకింగ్ రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీలో 2023 జులైలో విలీనమైంది. ఇదే తరహాలో ఇప్పుడు మరో రెండు ప్రైవేట్ బ్యాంకుల విలీనం జరుగుతోంది. విలీనానికి సిద్దమవుతున్న ఆ రెండు బ్యాంకులు ఏవి? ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో అగ్రగామిగా కొనసాగుతున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (AU SFB).. షేర్ల డీల్‌లో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకును (Fincare SFB) 2024 ఫిబ్రవరి 01 నాటికి విలీనం చేసుకోవడానికి సిద్ధమైంది. రెండు చిన్న ఫైనాన్స్ బ్యాంకుల మధ్య జరుగుతున్న మొదటి పెద్ద విలీనం ఇదే అని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటించింది.

భారతదేశంలో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు మొత్తం 1292 బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లను కలిగి ఉంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 339, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో 640, పట్టణ ప్రాంతాల్లో 179, మెట్రో ప్రాంతాల్లో 73 అవుట్‌లెట్‌లు ఉన్నాయి.

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన పోర్ట్‌ఫోలియోను విస్తరించడంతో భాగంగా ఈ విలీన ప్రక్రియ చేపడుతోంది. దీంతో వ్యాపార యూనిట్లకు క్రెడిట్ యాక్సెస్‌ను చేరువ చేసేందుకు ఈ విలీనం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది.

ఇదీ చదవండి: మెటాలో జాబ్.. రూ.6.5 కోట్ల వేతనం - ఎందుకు వదిలేసాడో తెలుసా?

2023 సెప్టెంబర్ 30 నాటికి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మొత్తం ఆస్తుల విలువ వరుసగా రూ. రూ.95977 కోట్లు, రూ.14777 కోట్లు. ఈ రెండు బ్యాంకులు విలీనం జరిగిన తరువాత ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)