Breaking News

ప్రభుత్వ రుణం దిగిరావాలి

Published on Wed, 05/07/2025 - 13:34

పెరిగిన ప్రభుత్వ రుణం మోస్తరు స్థాయికి దిగిరావాల్సి ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌సేత్‌ అన్నారు. తద్వారా వడ్డీ చెల్లింపులు తగ్గుతాయని, అప్పుడే రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ అవుతుందన్నారు. ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. అనిశ్చితులు పెరిగిపోతున్న  నేపథ్యంలో భారత్‌ ఏదో ఒక నిర్ధిష్టమైన మార్గానికి పరిమితం కాకూడదన్నారు.

‘మారుతున్న పరిణామాలకు మనం చురుగ్గా స్పందించాలి. నేడు భారత ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి సమీపించింది. మిగిలిన ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందన్నది తెలుసుకునేంత సామర్థ్యం మనకు ఉంది. ఈ దిశగా మనదైన మార్గాన్ని గుర్తించాలి’ అని వివరించారు. ప్రభుత్వ రుణం ప్రస్తుత స్థాయిల నుంచి కచ్చితంగా దిగిరావాలంటూ.. అందుకు ద్రవ్య స్థిరీకరణను మార్గంగా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆపరేషన్‌ సిందూర్‌.. స్టాక్‌ మార్కెట్‌పై ‍ప్రభావం ఎంత?

దేశ జీడీపీలో పన్నుల వాటా దశాబ్దం క్రితం 16.5 శాతంగా ఉంటే, అది ప్రస్తుతం 18 శాతానికి చేరినట్టు అజయ్‌సేత్‌ తెలిపారు. ప్రస్తుత ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే మరో 5–6 ఏళ్లలో 20 శాతానికి పన్నుల వాటా చేరుకోగలదన్నారు. వ్యయాల గురించి మాట్లాడుతూ.. మూలధన వ్యయాలకు అనుకూలంగా తగిన సర్దుబాట్లు జరుగుతున్నట్టు చెప్పారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)