Breaking News

నేడే హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌

Published on Fri, 01/24/2025 - 12:56

కేంద్ర బడ్జెట్ 2025-26(Budget 2025-26) తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ(Finance Ministry) నేడు సంప్రదాయ హల్వా వేడుకను నిర్వహిస్తుంది. ఈ వేడుకలు పార్లమెంట్‌ నార్త్‌బ్లాక్‌లో సాయంత్రం 5 గంటలకు పూర్తవుతాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో నిర్వహించే ఈ వేడుకకు బడ్జెట్ తయారీ ప్రక్రియలో పాలుపంచుకున్న అధికారులు పాల్గొంటారు. పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వీరు పార్లమెంట్‌లోని మంత్రిత్వ శాఖ ప్రాంగణానికే పరిమితం అవుతారు.

ఎలా జరుపుకుంటారు..?

భారతీయ తీపి వంటకం హల్వాను నార్త్ బ్లాక్ వద్ద పెద్ద కడాయిలో తయారు చేస్తారు. బడ్జెట్ తయారీలో పాల్గొన్న వారందరికీ ఆర్థిక మంత్రి సంప్రదాయబద్ధంగా కడాయి వెలిగించి హల్వా వడ్డిస్తారు. ఈ కార్యక్రమం ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల కృషిని గుర్తించడమే కాకుండా, బడ్జెట్ పత్రాలన్నింటినీ ముద్రించే ప్రక్రియకు నాంది పలుకుతుంది.

ఎవరు పాల్గొంటారు..?

కేంద్రమంత్రి ఈ ఏడాది వేడుకలకు కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరి, కార్యదర్శులు, బడ్జెట్ తయారీ, సంకలన ప్రక్రియలో ఉన్న అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగియనుండగా, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

ఇదీ చదవండి: రిలయన్స్‌ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు

1980 నుంచే హల్వా వేడుక

బడ్జెట్ తయారీ ప్రక్రియ గోప్యతకు ప్రతీకగా హల్వా వేడుక 1980 నుంచి జరుపుకుంటున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ నెలకొల్పిన రికార్డును అధిగమించి నిర్మలా సీతారామన్ తన ఏడో పూర్తికాల బడ్జెట్‌ను ఈసారి ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0 పాలనలో కీలక ప్రకటనలు, ఆర్థిక మార్గదర్శకాల కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల అంకితభావం, కృషికి హల్వా వేడుక నిదర్శనంగా నిలుస్తుంది.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)