ప్రభుత్వ బ్యాంకులకు పెట్టుబడుల పుష్‌

Published on Tue, 02/03/2026 - 05:19

న్యూఢిల్లీ: పీఎస్‌యూ బ్యాంకులలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) పరిమితిని పెంచే యోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత 20 శాతం పరిమితిని 49 శాతానికి పెంచాలని చూస్తున్నట్లు ఆర్థిక సరీ్వసుల కార్యదర్శి ఎం.నాగరాజు పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనస్థాయిని బలపరిచేందుకు వీలుంటుందని తెలియజేశారు. ఇందుకు అంతర్‌మంత్రిత్వ శాఖలతో చర్చిస్తున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం పీఎస్‌యూ బ్యాంకు(పీఎస్‌బీ)లలో ఎఫ్‌డీఐ పరిమితి 20 శాతంకాగా.. ప్రయివేట్‌ రంగ బ్యాంకులకు 74 శాతంగా అమలవుతోంది. అయితే 49 శాతంవరకూ ఆటోమేటిక్‌ మార్గంలో అను మతిస్తారు. ఆపై 74 శాతంవరకూ ప్రభుత్వ అనుమతిని పొందవలసి ఉంటుంది. నిజానికి 2020 నుంచి 12 పీఎస్‌బీలలో ప్రభు త్వం వద్దగల షేర్ల సంఖ్యలో మార్పులేనప్పటికీ కొన్ని బ్యాంకులలో వాటా శాతాలు మార్పులకు లోనయ్యాయి. ఆయా బ్యాంకులు మూలధన సమీకరణకు కొత్తగా షేర్లను జారీ చేయడం ప్రభావం చూపింది. కాగా.. ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి సంబంధించి ఈ నెల లో లేదా వచ్చే నెలలో  ఫైనాన్షియల్‌ బిడ్స్‌ ను ఆహ్వానించనున్నట్లు నాగరాజు తెలియజేశారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)