Breaking News

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ కొత్తగా వేస్తున్నారా?..

Published on Sun, 08/31/2025 - 14:20

మీరు వేతన జీవి అయినా, ఫ్రీలాన్సర్ లేదా ఇప్పుడే జాబ్ మార్కెట్లోకి ప్రవేశించినప్పటికీ, మొదటిసారి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేయడం సంక్లిష్టంగా అనిపించవచ్చు. అందుకే ఆదాయపు పన్ను శాఖ తరచుగా ఐటీ రిటర్నులను సౌకర్యవంతంగా, వేగంగా దాఖలు చేయడానికి చిట్కాలు, పద్ధతులను తెలియజేస్తుంటుంది.

ఐటీఆర్ దాఖలు చేయడానికి ముందు, పన్ను చెల్లింపుదారులు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పోర్టల్లో నమోదు చేసుకోవడం చాలా అవసరం. ఫైలింగ్ ప్రక్రియను సజావుగా, సౌకర్యవంతంగా చేయడానికి, ఐటీఆర్ పోర్టల్లో ఎలా నమోదు చేసుకోవాలన్నదానిపై ఆదాయపు పన్ను శాఖ వివరణాత్మక గైడ్‌ను షేర్‌ చేసింది. ఈ-పోర్టల్లో నమోదు చేసుకోవడానికి దశలవారీ గైడ్‌ను వివరిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.

ఐటీఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోండిలా..

  • స్టెప్‌ 1: ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌ - www.incometax.gov.in కు వెళ్లండి. హోమ్ పేజీ ఎగువ కుడి వైపు మూలలో ఉన్న 'రిజిస్టర్' బటన్ పై క్లిక్ చేయండి.

  • స్టెప్ 2: యూజర్ టైప్ ట్యాబ్ లో 'ట్యాక్స్ పేయర్' ఎంచుకొని 'కంటిన్యూ' క్లిక్ చేయాలి.

  • స్టెప్ 3: 'పాన్' ఆప్షన్లో పర్మినెంట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి 'వెలిడేట్' క్లిక్ చేయాలి. మీరు ఆధార్‌తో పాన్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి.

  • స్టెప్ 4: పాన్ వివరాలను ఇచ్చిన తర్వాత, మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డును ఎంటర్ చేసి, 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.

  • స్టెప్ 5: పూర్తి పేరు, పుట్టిన తేదీ, జెండర్‌, నివాస స్థితితో సహా ప్రాథమిక సమాచారాన్ని అందించండి. ఈ వివరాలను నమోదు చేసిన తర్వాత 'కంటిన్యూ' ఎంచుకోండి.

  • స్టెప్ 6: చెల్లుబాటులో ఉన్న కాంటాక్ట్ నెంబరు, ఈ-మెయిల్ ఐడీ, పూర్తి నివాస చిరునామా వంటి కాంటాక్ట్ వివరాలను నమోదు చేసి 'కంటిన్యూ' మీద క్లిక్ చేయండి.

  • స్టెప్ 7: మీరు ఇచ్చిన కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడీపై రెండు వేర్వేరు ఆరు అంకెల ఓటీపీలను మీరు అందుకుంటారు. తర్వాత మీ కాంటాక్ట్ వివరాలను ధృవీకరించి సంబంధిత ఫీల్డ్ ల్లో ఓటీపీలను నమోదు చేయండి. ఒకవేళ మీకు ఓటీపీలు రాకపోతే 'రీసెండ్ ఓటీపీ'పై క్లిక్ చేయండి

  • స్టెప్ 8: ఇప్పటివరకు అందించిన సమాచారం అంతటిని సమీక్షించుకుని అన్నీ సరిగ్గా ఉన్నట్లయితే 'కన్ఫర్మ్' మీద క్లిక్ చేయండి.

  • స్టెప్ 9: బలమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకుని మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ను ధృవీకరించండి. తరువాత, ధృవీకరించడానికి అదే పాస్‌వర్డ్‌ను మళ్లీ నమోదు చేయండి. చివరగా, వ్యక్తిగతీకరించిన లాగిన్ సందేశాన్ని సెట్ చేయండి. మీరు ఫిషింగ్ వెబ్‌సైట్‌లో లేరని, అధికారిక ఐటీ వెబ్‌సైట్లో ఉన్నారని నిర్ధారించడానికి ఈ దశ సహాయపడుతుంది.

  • పాస్ వర్డ్ పాలసీ: కనీసం 8 క్యారెక్టర్లు, గరిష్టంగా 14 క్యారెక్టర్లు ఉండాలి. ఇందులో అప్పర్‌ కేస్, లోయర్ కేస్ అక్షరాలు రెండూ ఉండాలి. ఒక సంఖ్య, ఒక ప్రత్యేక అక్షరాన్ని కలిగి ఉండాలి (ఉదా. @#$%).

  • స్టెప్ 10: రిజిస్టర్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ ఈ-ఫైలింగ్ అకౌంట్‌ క్రియేట్‌ అయ్యి లాగిన్ పేజీకి వెళ్తారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)