Breaking News

ఐటీఆర్‌ దాఖలుకు 5 ప్రధాన అంశాలు

Published on Sat, 05/10/2025 - 09:31

ఆదాయపు పన్ను దాఖలుకు సమయం రానే వచ్చింది. ఐటీఆర్‌ దాఖలుకు చివరితేదీని ప్రభుత్వం జులై 31గా నిర్ణయించింది. చివరి నిమిషంలో గందరగోళంగా పన్ను రిటర్న్‌లు ఫైల్‌ చేస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే అందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుని వీలైనంత త్వరగా ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటి దాఖలుకు ఎలాంటి ధ్రువపత్రాలు సమకూర్చుకోవాలి.. ఎలాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుందాం.

అవసరమైన డాక్యుమెంట్లు: పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఫారం 16 (వేతన జీవుల కోసం), బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఇన్వెస్ట్‌మెంట​్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోవడం: మీ ఆదాయ వనరు ఆధారంగా తగిన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫారాన్ని ఎంచుకోవాలి. ఉదా. వేతన జీవులు ఐటీఆర్ -1, వ్యాపార యజమానులు ఐటీఆర్ -3 తీసుకోవాలి.

పన్ను లెక్కలు: మీ మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం, మినహాయింపులు, చెల్లించాల్సిన మొత్తం పన్నును లెక్కించాలి. ఈ వివరాలు ఐటీఆర్‌ ఫైలింగ్‌ సమయంలో ఎంతో ఉపయోగపడుతాయి.

ఆన్‌లైన్‌లో ఐటీఆర్‌ దాఖలు: ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయి మీ వివరాలను నమోదు చేయాలి. మీ వద్ద ఉన్న ధ్రువపత్రాలు, ఇతర ఆధారాలతో రిటర్న్‌లు దాఖలు చేయవచ్చు.

ట్యాక్స్ రిటర్న్ వెరిఫై: ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి లేదా మీరు సంతకం చేసిన ఫిజికల్ కాపీలో వివరాలు నమోదు చేసి ఇన్‌కమ్‌ ట్యాక్‌ విభాగానికి పంపడం ద్వారా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. చాలామంది దీన్ని విస్మరిస్తారు. కేవలం ఐటీఆర్‌ ఫైల్‌ చేయడంతోనే ప్రక్రియ పూర్తి అయిపోతుందని అనుకుంటారు. కానీ కచ్చితంగా ట్యాక్స్‌ రిటర్న్‌లను వెరిఫై చేయాలి. అప్పుడే మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.

ఇదీ చదవండి: ఐపీఎల్ నిలిపివేత.. కంపెనీలకు నష్టం ఎంతంటే..

2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్‌ చివరి తేదీలు

  • వ్యక్తులు, ఉద్యోగులు: జులై 31, 2025

  • ఆడిట్ అవసరమయ్యే వ్యాపారాలు: అక్టోబర్ 31, 2025

  • కంపెనీలు: అక్టోబర్ 31, 2025

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)