Breaking News

బీవోపై ఎఫ్‌పీఐల వెనకడుగు

Published on Thu, 09/12/2024 - 05:55

న్యూఢిల్లీ: అంతిమ లబ్దిదారుల(బీవో) వెల్లడి నిబంధనలను వ్యతిరేకిస్తూ సెక్యూరిటీస్‌ అపిల్లేట్‌ ట్రిబ్యునల్‌(శాట్‌)ను ఆశ్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్‌(ఎఫ్‌పీఐ) సంస్థలు తాజాగా వెనక్కి తగ్గాయి. క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన బీవో నిబంధనల వెల్లడి గడువు ముగియనుండటంతో అత్యవసర ఉపశమనాన్ని కోరుతూ తొలుత శాట్‌కు ఫిర్యాదు చేశాయి. మారిషస్‌ ఎఫ్‌పీఐ సంస్థలు ఎల్‌టీఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్, లోటస్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సెబీ కొత్తగా విడుదల చేసిన నిబంధనల అమలు వాయిదాను కోరుతూ దరఖాస్తు చేశాయి. 

అయితే ఎఫ్‌పీఐల తరఫు న్యాయవాదులు ఫిర్యాదులను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటికే కోర్టుకు విన్నవించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిచాయి. గత ఐదు రోజులుగా ఎఫ్‌పీఐలు తమ పోర్ట్‌ఫోలియోలను విజయవంతంగా రీబ్యాలన్స్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిబంధనల పరిధిలోకి రాని హోల్డింగ్స్‌ను లిక్విడేట్‌ చేసుకున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అదానీ గ్రూప్‌పై 2023 జనవరిలో యూఎస్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వెలువరించిన నివేదికలో ఈ రెండు ఎఫ్‌పీఐల పేర్లను ప్రస్తావించడం గమనార్హం!  

ఏం జరిగిందంటే? 
సెబీ బీవో నిబంధనల అమలులో మరింత గడువు కోసం ఎఫ్‌పీఐలు శాట్‌ను ఆశ్రయించాయి. హోల్డింగ్స్‌ విషయంలో యాజమాన్య హక్కుల పూర్తి వివరాలను వెల్లడించని ఎఫ్‌పీఐలకు సెబీ సెపె్టంబర్‌ 9 డెడ్‌లైన్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 2025 మార్చివరకూ గడువు పెంపును కోరుతూ రెండు ఎఫ్‌పీఐ సంస్థలు శాట్‌కు దరఖాస్తు చేశాయి. 2023 ఆగస్ట్‌లో సెబీ బీవో నిబంధనలను జారీ చేసింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)