Breaking News

కొలువుల పండుగ!

Published on Thu, 07/17/2025 - 04:23

ముంబై: ఈసారి పండుగ సీజన్‌లో కంపెనీలు పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకోనున్నాయి. దీంతో 2025 ద్వితీయార్థంలో 2.16 లక్షల పైచిలుకు గిగ్, తాత్కాలిక ఉద్యోగాలు రానున్నాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే కొలువులు 15–20 శాతం పెరగనున్నాయి.  రిటైల్, ఈ–కామర్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, లాజిస్టిక్స్, ఆతిథ్య, ట్రావెల్, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాల్లో ఈ ఉద్యోగాలు రానున్నాయి. 

వర్క్‌ఫోర్స్‌ సొల్యూషన్స్‌ సంస్థ అడెకో ఇండియా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వివిధ వేదికల్లో తమ క్లయింట్లు పోస్ట్‌ చేసే ఖాళీలు, పరిశ్రమ నివేదికలు మొదలైన డేటా ఆధారంగా అడెకో ఇండియా దీన్ని రూపొందించింది. 

రాఖీ, దసరా, దీపావళిలాంటి పండుగలతో పాటు పెళ్లిళ్ల సీజన్‌ సందర్భంగా అమ్మకాలు పెరుగుతాయనే ఉద్దేశంతో నియామకాలు పుంజుకుంటున్నాయని నివేదిక పేర్కొంది. సాధారణం కంటే ఈసారి పండుగ సీజన్‌ మెరుగ్గా ఉంటుందనే అంచనాలతో కంపెనీలు హైరింగ్‌ ప్రక్రియను కాస్తంత ముందుగానే మొదలుపెట్టాయని వివరించింది. 

వినియోగదారుల సెంటిమెంటు మెరుగుపడటం, సానుకూల వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పుంజుకోవడం, ఆర్థిక పరిస్థితులపై ఆశావహ అంచనాలు నెలకొనడం, సీజనల్‌ అమ్మకాల విషయంలో కంపెనీలు దూకుడుగా ప్రచారం చేస్తుండటం వంటి అంశాలు ఈసారి హైరింగ్‌కి దన్నుగా నిలుస్తున్నట్లు నివేదిక వివరించింది.

 ‘ఈ పండుగ సీజన్‌లో డిమాండ్‌ చాలా వేగంగా పెరుగుతోంది. దానికి తగ్గట్లుగా పరిశ్రమ కూడా సన్నాహాలు చేసుకుంటోంది. గతంలో కంపెనీలు సంఖ్యాపరంగా ఎంత మందిని తీసుకున్నాం అనేదే చూసేవి. కానీ ఇప్పుడు, అభ్యర్థ్ధులు ఎంత త్వరగా ఉద్యోగంలో చేరగలరు, ఎంత సన్నద్ధంగా ఉన్నారు, వివిధ ప్రాంతాల్లో పరిస్థితులకు ఎంత వేగంగా సర్దుకోగలరులాంటి అంశాలపై కూడా కంపెనీలు దృష్టి పెడుతున్నాయి‘ అని అడెకో ఇండియా డైరెక్టర్‌ దీపేశ్‌ గుప్తా తెలిపారు.  

నివేదికలో మరిన్ని విశేషాలు.. 
→ హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణెలాంటి పెద్ద నగరాల్లో సీజనల్‌ హైరింగ్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉంది. గతేడాదితో పోలిస్తే అవకాశాలు 19% అధికం.  
→ లక్నో, జైపూర్, కోయంబత్తూర్, నాగ్‌పూర్, భువనేశ్వర్, మైసూరు, వారణాసిలాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా డిమాండ్‌ 42% పెరిగింది. విజయవాడ, కాన్పూర్, కొచ్చిలాంటి వర్ధమాన హబ్‌లలోనూ హైరింగ్‌  అంచనాలు మెరుగ్గా  న్నాయి. 
→ మెట్రో మార్కెట్లలో వేతనాలు 12–15%, వర్ధ మాన నగరాల్లో 18–22% స్థాయిలో పెరగవచ్చు. 
→ స్వల్పకాలిక ఈ ఏడాది సీజనల్‌ హైరింగ్‌లో మహిళల వాటా 23 శాతం పెరగనుంది. 
→ పండుగ సీజన్‌లో డిమాండ్‌ భారీగా ఉన్న సమయాల్లో కంపెనీలు లాస్ట్‌–మైల్‌ కార్యకలాపాలను (కస్టమర్ల ఇంటి దగ్గరకే ఉత్పత్తులను చేర్చడం) కూడా పటిష్టపర్చుకోనుండటంతో లాజిస్టిక్స్, డెలివరీల్లో హైరింగ్‌ 30–35% ఎగబాకనుంది. 
→ బీఎఫ్‌ఎస్‌ఐ రంగాన్ని తీసుకుంటే .. క్రెడిట్‌ కార్డుల అమ్మకాలు, పీవోఎస్‌ (పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) ఇన్‌స్టాలేషన్ల కోసం (ముఖ్యంగా ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల్లో) కంపెనీలు పెద్ద స్థాయిలో నియామకాలు చేపడుతున్నాయి. ఈ విభాగంలో డిమాండ్‌ 30 శాతం పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. 
→ హాస్పిటాలిటీ, ట్రావెల్‌ సెగ్మెంట్లలో రిక్రూట్‌మెంట్‌ డిమాండ్‌ 20–25% ఉండొచ్చు.  
→ మొత్తం సీజనల్‌ ఉద్యోగాల కల్పనలో  35–40% వాటాతో రిటైల్, ఈ–కామర్స్‌ విభాగాల ఆధిపత్యం కొనసాగనుంది. 
→ డిజిటల్‌పై పట్టు, బహుభాషా సామర్థ్యాలు, కస్టమర్లను హ్యాండిల్‌ చేయగలిగే నైపుణ్యాలకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నా యి. ఇన్‌–స్టోర్‌ సేల్స్, క్రెడిట్‌ కార్డ్‌ ప్రమోషన్లు, డెలివరీ ఉద్యోగాల కోసం ఈ నైపుణ్యాలను చూస్తున్నాయి. 
  

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)