Breaking News

ఫెడ్‌ 0.25 శాతం వడ్డీ పెంపు

Published on Thu, 03/23/2023 - 04:49

న్యూయార్క్‌: అంచనాలకు అనుగుణంగా యూఎస్‌ కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటును 0.25 శాతం పెంచింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేటు 4.75–5 శాతానికి చేరింది. నిజానికి కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణ అదుపునకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ఫెడ్‌.. వడ్డీ రేట్లను వేగంగా పెంచుతూ వస్తోంది. దీంతో 2022 మార్చి నుంచి 2023 ఫిబ్రవరి1 వరకూ దశలవారీగా 4.5 శాతం వడ్డీ రేటును పెంచింది. వెరసి 2022 ఫిబ్రవరిలో 0–0.25 శాతంగా ఉన్న ఫండ్స్‌ రేటు తాజాగా 5 శాతానికి ఎగసింది. ఫెడ్‌ చైర్మన్‌ జెరోమీ పావెల్‌ అంచనాలను మించి వడ్డీ రేట్లు పెరిగే వీలున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. b v

అయితే కొద్ది రోజులుగా అమెరికా, యూరప్‌ బ్యాంకింగ్‌ రంగాలలో సంక్షోభ పరిస్థితులు తలెత్తడంతో ఫెడ్‌ పాలసీ సమీక్షకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. యూఎస్‌లో సిల్వర్‌గేట్‌ క్యాపిటల్, సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్‌ బ్యాంక్‌ ఇప్పటికే విఫలంకాగా.. ప్రస్తుతం ఫస్ట్‌ రిపబ్లిక్‌ బ్యాంకు సంక్షోభంలో ఉంది. మరోవైపు క్రెడిట్‌ స్వీస్‌ దివాలా స్థితికి చేరడంతో యూరప్‌ బ్యాంకింగ్‌ రంగంలోనూ ప్రకంపనలు పుడుతున్నాయి. స్విస్‌ కేంద్ర బ్యాంకు కల్పించుకుని యూబీఎస్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు వేగానికి బ్రేక్‌ పడనున్నట్లు పలువురు విశ్లేషకులు భావిస్తూ వచ్చారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)