Breaking News

దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించండి 

Published on Fri, 01/03/2025 - 06:06

న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయాలని కేంద్రాన్ని ఆర్థిక రంగం విజ్ఞప్తి చేసింది. ఫిక్సిడ్‌ డిపాజిట్లపై పన్ను మినహాయింపులు ఇవ్వాలని కోరింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జరిగిన ఏడో ప్రీ–బడ్జెట్‌ సమావేశంలో ఆర్థిక రంగం ప్రతినిధులు ఈ మేరకు వినతులు ఇచ్చారు. క్యాపిటల్‌ మార్కెట్లను మరింత మెరుగుపర్చేందుకు తీసుకోతగిన చర్యలను కూడా తెలియజేసినట్లు ఎడెల్విస్‌ మ్యుచువల్‌ ఫండ్‌ ఎండీ రాధికా గుప్తా వెల్లడించారు. 

ఎలక్ట్రిక్‌ వాహనాలకు, పర్యావరణహిత ప్రాజెక్టులకు రుణాలకు సంబంధించి రీఫైనాన్స్‌ విండోను ఏర్పాటు చేయాలని నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగం కోరినట్లు ఫైనాన్స్‌ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎఫ్‌ఐడీసీ) డైరెక్టర్‌ రమణ్‌ అగర్వాల్‌ వివరించారు. గృహ రుణాల కంపెనీల తరహాలోనే ఎలక్ట్రిక్‌ వాహనాలు మొదలైన వాటికి రీఫైనాన్సింగ్‌ చేసేందుకు సిడ్బి, నాబార్డ్‌ల కోసం నిర్దిష్ట ఫండ్‌ను ఏర్పాటు చేయొచ్చని సూచించినట్లు పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రధాన ఆర్థిక సలహాదారు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను కేంద్రం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుంది.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)