Breaking News

ఆన్‌లైన్‌ షాపింగ్‌ కోసం అత్యుత్సాహం వద్దు!: హెచ్చరికలు జారీ

Published on Sat, 11/30/2024 - 15:43

ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఎదురుచూస్తున్న బ్లాక్‌ఫ్రైడే సేల్స్ మొదలైపోయాయి, షాపింగ్ హడావిడి కూడా పెరిగిపోయింది. దీనిని అదనుగా తీసుకున్న స్కామర్లు.. ప్రజలను దోచుకోవడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే, ఈ సారి జరిగే మోసాలు 89 శాతం ఎక్కువని ఫోర్బ్స్ నివేదిక వెల్లడించింది. దాదాపు 80 శాతం షాపింగ్ సంబంధిత ఇమెయిల్‌లు స్కామ్‌లుగా గుర్తించారు. వినియోగదారులను మోసం చేయడానికి స్కామర్లు గూగుల్ సెర్చింగ్ ఫలితాలను కూడా తారుమారు చేస్తున్నట్లు సమాచారం.

బ్లాక్‌ఫ్రైడే సేల్స్ సందర్భంగా చాలా మోసాలు జరుగుతున్నాయని.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి హెచ్చరికలు జారీ చేసింది. బ్లాక్‌ఫ్రైడే, సైబర్ మండే, మిగిలిన సెలవు సీజన్‌లలో మోసాల నుంచి తమను తాము రక్షించుకోవాలని.. మోసాల బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని ఎఫ్‌బీఐ పేర్కొంది.

యూఎస్ మార్కెట్‌లో 95 శాతం ఆధిపత్యం చెలాయించే క్రోమ్, సఫారీ, ఎడ్జ్ వంటి ప్రసిద్ధ వెబ్ బ్రౌజర్‌ల వినియోగదారులను కూడా ఎఫ్‌బీఐ హెచ్చరిస్తూ.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే సమయంలో ఆఫర్ లేదా డిస్కౌంట్ వంటి వాటిలో ఏ మాత్రం అనుమానం అనిపించినా వెంటనే జాగ్రత్త పడాలి.

ఆఫర్లు చూసిన మోసపోయి.. స్కామర్‌లకు బాధితులవ్వకండి. ప్రతి సంవత్సరం, వేలాది మంది ప్రజలు ఈ స్కాములకు బలైపోతున్నారని ఎఫ్‌బీఐ వెల్లడించింది. స్కామర్ల చేతికి చెక్కితే.. సంపాదించినా డబ్బు, వ్యక్తిగత సమాచారం వంటి వాటిని దోచుకుంటారు.

ఎఫ్‌బీఐ ముందు జాగ్రత్త చర్యలు
ఆన్‌లైన్‌లో కొంతమంది వస్తువులపై ఎక్కువ ఆఫర్స్ ప్రకటిస్తూ ఆకర్షిస్తారు. ఇది నిజమని నమ్మి డబ్బు చెల్లించి, మీరు దానిని బుక్ చేసుకుంటే మీకు ఎప్పటికీ డెలివరీ రాదు. ఇలాంటి తరహా నాన్ డెలివరీ స్కామ్‌లు, నాన్ పేమెంట్ స్కామ్‌లు, గిఫ్ట్ కార్డ్ మోసాలు జరుగుతుంటాయి. ఇలాంటివి అస్సలు నమ్మకూడదు.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు