Breaking News

భారత్‌లో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారు ఇదే!

Published on Sat, 04/12/2025 - 17:19

ఎంజీ విండ్సర్ (MG Windsor) ఎలక్ట్రిక్ కారు అమ్మకాల్లో అరుదైన ఘనత సాధించిందని జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా ప్రకటించింది. మార్కెట్లో లాంచ్ అయిన ఆరు నెలల్లో 20,000 యూనిట్లు సేల్ అయ్యాయి. దీంతో వేగంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా విండ్సర్ నిలిచింది.

ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న ఎంజీ మోటార్ కార్లకంటే భిన్నంగా ఉన్న.. విండ్సర్ ఈవీ అతి  వేంగంగా అమ్ముడైందని.. జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా డైరెక్టర్ సేల్స్ & మార్కెటింగ్ రాకేష్ సేన్ స్పష్టం చేశారు. మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్.. అధిక రేంజ్ వంటి కారణాల వల్ల దీనిని చాలామంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఎంజీ విండ్సర్ 38 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఒక ఫుల్ ఛార్జ్‌పై 332 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 136 హార్స్ పవర్, 200 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎక్సైట్ (రూ. 13,99,800), ఎక్స్‌క్లూజివ్ (రూ. 14,99,800), ఎసెన్స్ (రూ. 15,99,800) అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.

ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకు

ఎంజీ మోటార్ కంపెనీ.. భారతదేశంలో ప్రస్తుతం హెక్టర్, ఆస్టర్, గ్లోస్టర్, జెడ్ఎస్ఈవీ, కామెట్‌ వంటి ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. కాగా కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి సైబర్‌స్టర్‌ అనే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)