Breaking News

ఒక్కసారి చెల్లిస్తే.. ఏడాదంతా ఫ్రీ జర్నీ

Published on Sun, 08/03/2025 - 13:44

టోల్‌ గేట్‌ గుండా ప్రయాణించే వాహనదారుల కోసం కేంద్రం వార్షిక పాస్‌ను ప్రకటించింది. దీని ద్వారా సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించవచ్చు. ఇది ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర రవాణా శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' ప్రకటించారు. ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

  • 2025-26 సంవత్సరానికి ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్ ధర రూ. 3,000. వినియోగదారుడు రాజ్‌మార్గయాత్ర మొబైల్ అప్లికేషన్ లేదా ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) వెబ్‌సైట్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. చెల్లింపులు పూర్తయిన తరువాత యాన్యువల్ పాస్ 2 గంటల్లో యాక్టివేట్ అవుతుంది.

  • ఫాస్ట్‌ట్యాగ్‌ వార్షిక పాస్.. ప్రైవేట్ కార్లు, జీప్, వ్యాన్‌లు నేషనల్ హైవే (NH) & నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వే (NE) టోల్ ప్లాజాల ద్వారా ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పులకు (ఏది ముందు అయితే అది) ఉచితంగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది.

  • ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్ కోసం వినియోగదారులు ఫాస్ట్‌ట్యాగ్‌ కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. మీ ప్రస్తుత ఫాస్ట్‌ట్యాగ్‌లో వార్షిక పాస్‌ను యాక్టివేట్ చేయవచ్చు.

ఇదీ చదవండి: విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?

ఫాస్ట్‌ట్యాగ్‌ యాన్యువల్ పాస్ ద్వారా ఒకేసారి టోల్ చెల్లింపులు చేసి ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు. పండగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో టోల్‌ గేట్ల వద్ద వెయిటింగ్‌ సమయాలను తగ్గించేందుకు వీలవుతుంది. జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)