Breaking News

మీకు తెలుసా? ప్రముఖ వ్యాపారవేత్తల ఫస్ట్ జాబ్స్ ఇవే..

Published on Mon, 06/10/2024 - 19:51

భారతదేశంలో అత్యంత సంపన్నులైన గౌతమ్ అదానీ, రతన్ టాటా, ఇంద్రా నూయీ, అర్దేషిర్ గోద్రెజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే వీరందరూ ప్రారంభంలో ఎలాంటి ఉద్యోగాలు చేశారనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలను వివరంగా తెలుసుకుందాం.

రతన్ టాటా
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా.. భారతదేశంలో విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు. దేశం కోసం ఎంతో కృషి చేసిన ఈయన 1961లో టాటా స్టీల్ కంపెనీలో చేరారు. ఇదే ఆయన మొదటి ఉద్యోగం. ఆ తరువాత క్రమంగా ఎదిగి టాటా గ్రూప్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

గౌతమ్ అదానీ
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ 1978లో మహేంద్ర బ్రదర్స్ అనే వజ్రాల దుకాణంలో పనిచేసినట్లు సమాచారం. ఇదే అదానీ మొదటి ఉద్యోగం. అక్కడే మూడు సంవత్సరాలు పనిచేసి ముంబయిలోని సొంతంగా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించి నేడు బిలినీయర్ల జాబితాలోకి చేరారు.

ఇంద్రా నూయీ
1955లో జన్మించిన ఇంద్రా నూయీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలలో ఒకటైన పెప్సికోకు 12 ఏళ్లపాటు సీఈఓగా పనిచేశారు. ఈమె 18 సంవత్సరాల వయసులో ఓ బ్రిటీష్ టెక్స్​టైల్ కంపెనీలో పనిచేసినట్లు సమాచారం. ఆ తరువాత ముంబయిలోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు.

అర్దేషిర్ గోద్రెజ్
గోద్రెజ్ గ్రూప్ సంస్థల అధినేత అర్దేషిర్ గోద్రెజ్ మొదట్లో ఓ కెమిస్ట్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తరువాత ఓ చిన్న షెడ్​లో తాళాలు తయారు చేసే వ్యాపారం ప్రారంభించి క్రమంగా ఎదిగారు. ప్రస్తుతం దిగ్గజ వ్యాపారసంస్థల సరసన గోద్రెజ్ గ్రూప్​ నిలిచింది.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)