Breaking News

ప్రముఖ బ్యాంక్‌లో 10,000 ఉద్యోగాల కోత

Published on Sun, 12/07/2025 - 17:50

స్విట్జర్లాండ్‌లో అతిపెద్ద బ్యాంకు అయిన యూబీఎస్‌ రాబోయే మూడేళ్లలో సుమారు 10,000 ఉద్యోగాలను తొలగించే ప్రణాళికను పరిశీలిస్తోందని స్విస్ వార్తాపత్రిక ‘సోన్‌టాగ్స్ బ్లిక్’(SonntagsBlick) తెలిపింది. 2023లో క్రెడిట్ సూయిస్ విలీనం తర్వాత ఈ భారీ పునర్నిర్మాణ ప్రక్రియ జరుగుతోందని పేర్కొంది.

బ్యాంకు వ్యవస్థలో పునరావృత కార్యకలాపాలను తగ్గించడానికి ఈ ఉద్యోగ కోతలు, విలీన ప్రక్రియ ఎంతో తోడ్పడుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే యూబిఎస్ ప్రతినిధులు ఈ 10,000 సంఖ్యను మాత్రం కచ్చితంగా ధ్రువీకరించలేదని గమనించాలి.

క్రెడిట్ సూయిస్ కొనుగోలు (మార్చి 2023) తర్వాత యూబీఎస్‌ తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా వీలైనంత తక్కువగా ఉద్యోగ కోతలు ఉండేటా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు యూబీఎస్‌ ప్రతినిధులు చెప్పారు. బ్యాంకులో ఏవైనా  తగ్గింపులు ఉంటే దానికి చాలా కాలం పడుతుందని తెలిపారు. ఈ క్రమంలో తక్షణ తొలగింపుల (లేఆఫ్స్‌) సంఖ్యను తగ్గించడానికి బ్యాంకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ఉద్యోగుల సంఖ్యపై ప్రభావం

2024 చివరి నాటికి యూబీఎస్‌లో సుమారు 1,10,000 మంది ఉద్యోగులు ఉండగా 10,000 కోతలు దాదాపు 9 శాతం తగ్గుదలకు సమానం. ఇప్పటికే బ్యాంక్ 2025 సెప్టెంబర్ చివరి నాటికి ఉద్యోగుల సంఖ్యను 1,04,427కి తగ్గించింది. అంటే, ఈ విలీనం ప్రభావంతో ఇదివరకే సుమారు 15,000 ఉద్యోగాలు తొలగించినట్లు తెలుస్తుంది.

ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో నరాల సమస్య

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)