Breaking News

ఎలక్ట్రిక్‌ బైక్‌లు కొనేవారికి బ్యాడ్‌ న్యూస్‌.. సబ్బిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం!

Published on Thu, 05/18/2023 - 15:09

ఎలక్ట్రిక్‌ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీకి కోత పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వం సబ్సిడీని తగ్గిస్తే ఆ భారం కస్టమర్లపై పడే అవకాశం ఉంది. అంటే ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలను తయారీ సంస్థలు పెంచే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: ఎలక్ట్రిక్‌ కార్ల కోసం ప్రత్యేక యాప్‌! రూపొందించిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం 

ప్రస్తుతం ఫేమ్‌ (FAME) 2 పథకం కింద ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలకు 40 శాతం సబ్సిడీ ఇ‍స్తోంది. ఈ పథకం కొనసాగుతుందా లేదా అన్న దానిపై చాలా కాలంగా అనేక పుకార్లు ఉన్నాయి. వీటి ప్రభావం ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలను కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్ సెగ్మెంట్‌పై ఎక్కువగా దృష్టి పెట్టిందని, ఇతర ఎలక్ట్రిక్‌ వాహనాలపై సబ్సిడీలను పూర్తిగా నిలిపివేయనుందని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే అధికారికంగా ఇంకా తుది నిర్ణయం ప్రకటించలేదు.

అయితే తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీని నిర్ణయించడానికి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కొత్త ఫార్ములాను ప్రతిపాదించినట్లు ఫినాన్షియల్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం పేర్కొంటోంది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం 40 శాతం ప్రకారం కిలోవాట్‌కు ఇస్తున్న రూ.15,000 సబ్సిడీ రూ.10,000లకు తగ్గించాలని మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోంది. 

సబ్సిడీపై గరిష్ట పరిమితిని కూడా ప్రస్తుత 40 శాతం నుంచి ఎంఆర్‌పీలో 15 శాతానికి తగ్గించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉదాహరణకు రూ.1.5 లక్షల ధర, 3.5 కిలోవాట్‌ల బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఎలక్ట్రిక్‌ బైక్‌పై ప్రస్తుతం రూ.52,500 సబ్సిడీ వస్తుంది. కొత్త ఫార్ములా ప్రకారం సబ్సిడీ రూ.22,500 లకు తగ్గిపోతుంది. ఫేమ్‌ 2 పథకం కింద వచ్చే ఏడాది నాటికి పది లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు మద్దతునిచ్చేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ వాహనాలపై సబ్సిడీ మాత్రం తగ్గించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఇక నో వెయిటింగ్‌! స్పీడ్‌ పెంచిన టయోటా.. ఆ వాహనాల కోసం మూడో షిఫ్ట్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)