Breaking News

రాష్ట్రమంతా నకిలీ రూ.500 నోట్లు.. పోలీసుల అలర్ట్‌

Published on Fri, 01/10/2025 - 17:26

రాష్ట్రమంతా నకిలీ 500 రూపాయల నోట్లు (Fake 500 rupee notes) చెలామణి అవుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని బిహార్ (Bihar) పోలీస్ హెడ్ క్వార్టర్స్ అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఐజీ (స్పెషల్ బ్రాంచ్) డీఎంలు, ఎస్‌ఎస్‌పీలు, ఎస్పీలు, రైల్వే ఎస్పీలందరికీ లేఖ రాశారు.

నకిలీ నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెల్లింగ్‌లో తప్పు ఉందని, స్మగ్లర్లు విడుదల చేసిన 500 రూపాయల నోటుపై ఇంగ్లిష్‌లో ‘Reserve Bank of India’ అని కాకుండా ‘Resarve Bank of India’ అని రాసి ఉంటుందని ఐజీ లేఖలో వివరించారు.

ఈ నేపథ్యంలో నకిలీ నోట్లను గుర్తించడంతోపాటు ప్రత్యేక పాలనాపరమైన నిఘాను నిర్వహించేందుకు ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. లేఖతో పాటు నకిలీ 500 రూపాయల నోటు చిత్రాన్ని కూడా జత చేశారు.

నకిలీ నోటును ఎలా గుర్తించాలి?

  • అసలైన నోట్లు విలక్షణమైన ఆకృతిని, స్పర్శను కలిగి ఉంటాయి. నకిలీ నోట్లు అలా ఉండవు.

  • అసలైన నోట్లు మంచి రంగు, ప్రింటింగ్ నాణ్యతను కలిగి ఉంటాయి. కానీ నకిలీ నోట్లుపై రంగుల్లో తేడాను, అస్పష్టమైన ముద్రణను గమనించవచ్చు.

  • అసలైన నోట్లలో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. ఇది నోటు చిరిగిపోయినప్పుడు కనిపిస్తుంది. నకిలీ నోట్లలో ఈ థ్రెడ్ ఉండదు.

  • అసలు నోట్లు వాటర్‌మార్క్‌ని కలిగి ఉంటాయి. నోట్‌ను నీటిలో ముంచినప్పుడు అది కనిపిస్తుంది. నకిలీ నోట్లలో ఈ వాటర్‌మార్క్ ఉండదు.

  • బ్యాంకులు, ఇతర వ్యాపారాల వద్ద నకిలీ నోట్లను గుర్తించగల నోట్-చెకింగ్ పరికరాలు ఉంటాయి.

  • అసలైన నోట్లు యూవీ-కాంతి ఉద్గార మూలకాలను కలిగి ఉంటాయి. నకిలీ నోట్లలో అవి ఉండవు.

  • ఇక నకిలీ నోట్లను గుర్తించే అనేక మొబైల్ యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

  • మీకు వద్ద ఉన్నది నకిలీ నోటని అనుమానం వస్తే బ్యాంక్‌కు వెళ్లి తనిఖీ చేయించుకోవచ్చు.

అసలు నోటు లక్షణాలు

  • అసలు 500 రూపాయల నోటు మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో  ముద్రించి ఉంటుంది. దేవనాగరిలో 500 అని రాసి ఉంటుంది.
  • అసలు 500 రూపాయల నోటులో కలర్ సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. నోటును వాలుగా చూస్తే ఆకుపచ్చ నుండి నీలం రంగులోకి మారినట్లు కనిపిస్తుంది.
  • అసలు 500 రూపాయల నోటుపై ఎలక్ట్రోటైప్ వాటర్‌మార్క్‌ ఉంటుంది. ఈ నోటుకు కుడి వైపున అశోక స్తంభం గుర్తును కూడా చూడొచ్చు.
  • ఈ నోట్‌లో మహాత్మా గాంధీ, అశోక చిహ్నం చిత్రాలను చేత్తో తాకితే తగిలేలా ముద్రించి ఉంటారు. దృష్టి లోపం ఉన్నవారి కోసం ఈ ఏర్పాటు చేశారు.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)