Breaking News

రూ.2000 నోట్లు ఇంకా ఉన్నాయా? మార్చుకోవడానికి మరో మార్గం ఇదే!!

Published on Sun, 10/08/2023 - 19:38

భారతదేశంలో రూ. 2000 నోట్ల డిపాజిల్ లేదా ఎక్స్చేంజ్ గురించి ఆర్‌బీఐ ప్రకటించి ఇప్పటికే మూడు నెలల కంటే కూడా ఎక్కువైంది. ప్రారంభంలో 2023 సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అని ప్రకటించగా.. రావాల్సిన నోట్లు ఇంకా ఉండటం వల్ల ఈ గడువుని అక్టోబర్ 07కి పొడిగించారు. ఆ గడువు కూడా నిన్నటితో ముగిసిపోయింది. అయితే ఇప్పటికీ ఉన్న నోట్లను ఎలా మార్చుకోవాలి? ఎక్కడ డిపాజిట్ చేసుకోవాలనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇప్పటికి తిరిగి రావాల్సిన నోట్లు 3.37 శాతం ఉన్నాయి, అంటే సుమారు రూ. 12000 కోట్లు వెనక్కి రావాల్సి ఉంది. కాగా 96 శాతం కంటే ఎక్కువ నోట్లు వెనక్కి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికీ రూ. 2000 నోట్లను మార్చుకోవాలంటే నేరుగా బ్యాంకుల్లో మార్చుకోవడానికి వెసులుబాటు ఉండదు.

రూ. 2000 నోట్లు కలిగిన కస్టమర్లు లేదా సంస్థలు నేరుగా 19 ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. వీరు ఒక్క సారికి రూ. 20,000 నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా పంపవచ్చు. 

ఇదీ చదవండి: మెకానిక్ నుంచి వేలకోట్ల సామ్రాజ్యం.. ఎక్కడైతే అడుగుపెట్టలేడని ఎగతాళి చేశారో అక్కడే..

అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి.

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)