Breaking News

Facebook: కొత్త ఫీచ‌ర్ గురించి తెలుసా?!

Published on Fri, 06/11/2021 - 12:39

సాక్షి, ముంబై: గ‌తేడాది ఫేస్‌బుక్‌ ప్రైవసీ ఫీచ‌ర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆఫ్ - ఫేస్‌బుక్‌  పేరుతో తెచ్చిన ఈ ఫీచ‌ర్ సాయంతో  ఫేస్‌బుక్‌ లో యాప్స్, వెబ్ సైట్లు, థ‌ర్డ్ పార్టీ సైట్లు షేర్ చేసే డేటాను మీరు కంట్రోల్ చేయవ‌చ్చు. ఆ ఆప్ష‌న్ ను మీరు ఆన్ చేస్తే కంటెంట్ మీ ఫేస్ బుక్ లో డిస్‌ప్లే అవుతుంది. ఆ డేటా ను మీరు క్లియ‌ర్ చేసుకోవాలంటే చేసుకోవ‌చ్చు. అదే ఆప్ష‌న్ ఆఫ్  చేస్తే ఆ డేటా ఫేస్‌బుక్‌లో క‌నిపించ‌దు. అంతేకాదు ఏ కంపెనీకి చెందిన యాడ్స్  ఫేస్‌బుక్‌లో క‌నిపించాల‌న్నా,  లేదా బ్లాక్ చేయాల‌న్నా అంతా మీ చేతిలోనే ఉంటుంది. దీంతో పాటు మీరు ఫేస్‌బుక్‌లో ఏ కంటెంట్‌ను ఎక్కువగా చూస్తున్నారో థ‌ర్డ్ పార్టీ యాప్స్ సాయంతో తెలుసుకోవ‌డం క‌ష్టం.     

ఆఫ్-ఫేస్ బుక్ ఫీచ‌ర్ తో లాభం ఏంటి?
ఫేస్‌బుక్ లో  కొన్ని టూల్స్ ను వినియోగించి బిజినెస్ కు సంబంధించిన యాడ్స్‌, ప్ర‌మోష‌న్, లేదంటే ఫేస్‌బుక్‌ యూజ‌ర్ వ్య‌క్తిగత డేటా తెలుసుకోవ‌చ్చు. అయితే మీరు ఆఫ్ ఫేస్‌బుక్‌ టూల్ తో  ఏఏ సంస్థ‌లు మీకు బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ ఇన్ఫ‌ర్మేష‌న్ షేర్ చేస్తున్నాయో తెలుసుకోవ‌చ్చు. మ‌రి ఈ టూల్ ను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.  (Facebook smartwatch: ఆ దిగ్గజాలకు గట్టి పోటీ!)

ఆఫ్-ఫేస్ బుక్ టూల్ ను ఎలా యాక్టివ్ చేసుకోవాలి?  
• ముందుగా ఫేస్‌బుక్‌ సెట్టింగ్ అండ్ ప్రైవ‌సీ ఆప్ష‌న్ లోకి వెళ్లాలి.   
•  ఆ త‌రువాత‌ సెట్టింగ్ పై క్లిక్ చేయండి.
• సెట్టింగ్ పై క్లిక్ చేసిన వెంట‌నే  “యువ‌ర్ ఫేస్ బుక్ ఇన్ఫ‌ర్మేష‌న్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది.  
• ఆ త‌రువాత ఆఫ్ ఫేస్‌బుక్‌ యాక్టివిటీ ఆప్ష‌న్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ నుండి మీరు మీ ఆఫ్ ఫేస్‌బుక్‌ టూల్ ని యూజ్ చేసి ఇక పై మీ ఫేస్‌బుక్‌లో ఎలాంటి వ్యాపార కార్య‌క‌లాపాలు నిర్వ‌హించాలో డిసైడ్  చేయోచ్చు. అంతేకాదు మీరు ఫేస్‌బుక్‌ లో చూసిన కంటెంట్ హిస్ట‌రీని డిలీట్ చేయోచ్చు.  

ఆఫ్ ఫేస్ బుక్ ఫీచ‌ర్ ను ఆపేస్తే ఏమ‌వుతుంది? 
ఆఫ్ ఫేస్‌బుక్‌ ఫీచ‌ర్ ను ఆఫ్ చేస్తే వెబ్ సైట్లు, యాప్స్‌, ఇత‌ర థ‌ర్డ్ పార్టీ టూల్స్ ఫేస్ బుక్ లో మీరు ఏ కంటెంట్ చూస్తున్నారో క‌నిపెట్ట‌లేవు. ఫేస్‌బుక్‌  సైతం మీరు ఏం కంటెంట్ చూస్తున్నారో గుర్తించ‌లేదు. దీంతో పాటు యాడ్స్ కూడా మీ ఫేస్ బుక్ లో  డిస్ ప్లే కావు.  (కావాలనుకుంటే శాశ్వతంగా వర్క్‌ ఫ్రం హోం చేసుకోవచ్చు!)

మీరు  యాపిల్  సంస్థ డివైజెస్ ను వినియోగిస్తున్నారా? 
అయితే ఇటీవ‌ల యాపిల్ సంస్థ  iOS 14.5 అప్ డేట్ ను విడుద‌ల చేసింది. దీని సాయంతో ఫేస్ బుక్ లో మీ వ్య‌క్తిగ‌త స‌మాచారాన్ని, లేదంటే డిస్ ప్లే అవుతున్న ప‌లు కంపెనీల యాడ్స్ , మీరు చూసే కంటెంట్‌ను  వ్యాపారం నిమిత్తం ఇత‌ర కంపెనీల‌కు షేర్ చేయ‌డం అసాధ్యం అవుతుంది.   (Covaxin: అమెరికాలో భారీ ఎదురుదెబ్బ!)

Videos

మా మదర్సాపై బాంబులు పడ్డాయి! పూంచ్ ముస్లింల ఆవేదన..

సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయి

ఇవాళ ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ

విడదల రజిని ఘటనపై ఎంపీ తనుజా రాణి ఫైర్

వైఎస్ఆర్ సీపీకి చెందిన ప్రజా ప్రతినిధి కల్పనపై అక్రమ కేసు

కోట శ్రీనివాస్ కోడి లెక్కన్నే ఉన్నయ్.. సూపర్ సిక్స్ పథకాలు

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బెయిల్‌

వరంగల్ పర్యటనకు ప్రపంచ సుందరీమణులు..

కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదు.. డీజీపీపై అంబటి ఫైర్

అణ్వాయుధాలకు బెదిరే ప్రసక్తేలే..!

Photos

+5

అంగరంగ వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

దారి వెంట నీరాజనం..‘జై జగన్‌’ అంటూ నినాదాలు (ఫొటోలు)

+5

#MissWorld2025: బ్యూటీ విత్‌ ఫన్‌..‘బుట్ట బొమ్మా’ పాటకు స్టెప్పులు (ఫొటోలు)

+5

చౌమహల్లా ప్యాలెస్‌లో యువరాణుల్లా మెరిసిన సుందరీమణులు (ఫొటోలు)

+5

చార్మినార్ దగ్గర మిస్‌ వరల్డ్‌ అందాలభామల ఫోటోషూట్ (ఫొటోలు)

+5

భావితరాలు మీరు ఆదర్శం: భారత సైన్యానికి మోదీ సెల్యూట్ (ఫొటోలు)

+5

హీరో గోపీచంద్ వెడ్డింగ్ యానివర్సరీ (ఫొటోలు)

+5

నిర్మాత ఇషారీ గణేశ్ కూతురి రిసెప్షన్.. హాజరైన స్టార్స్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?