ఆపరేషన్ సిందూర్ పై మోదీ కీలక ప్రకటన
Breaking News
ఫేస్‌బుక్‌లో మరొ కొత్త ఫీచర్
Published on Tue, 07/06/2021 - 21:38
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్‌బుక్ భవిష్యత్తులో మరో కొత్త ఫీచరును నెటిజన్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ట్విటర్‌లో ఉండే ‘థ్రెడ్’ ఫీచరును ఫేస్‌బుక్‌లో ప్రవేశపెట్టాలని చూస్తోంది. ట్విటర్‌లో యూజర్ పోస్ట్ చేయాలనుకున్న సందేశాన్ని కేవలం 280 క్యారక్టర్లను మాత్రమే పోస్ట్ చేయవచ్చును. మిగతా సమాచారాన్ని ముందుపెట్టిన ట్విట్‌కు థ్రెడ్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటారు.
ప్రస్తుతం ఈ ఫీచరును ఫేసుబుక్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురావలని చూస్తోంది. థ్రెడ్ ఫీచరును ఫేస్‌బుక్ టెస్టింగ్ చేస్తోంది. కొంతమంది ఫేస్‌బుక్ పబ్లిక్ ఫిగర్లకు అందుబాటులో ఉంచింది. దీంతో ఫలానా సమాచారానికి సంబంధించిన విషయాలను సులువుగా థ్రెడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌పై ఫేస్‌బుక్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవారా థ్రెడ్ ఫీచర్కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కాగా ఫేస్‌బుక్ తన యూజర్లకు క్లబ్‌హౌజ్‌లాంటి సర్వీస్‌ను త్వరలోనే ప్రారంభించాలని చూస్తోంది. ఈ థ్రెడింగ్ ఫీచర్ భవిష్యత్తులో యూజర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
NEW! Facebook is testing a ‘Threads’ feature
h/t @valionk pic.twitter.com/yqv8PIoTcf
— Matt Navarra (@MattNavarra) July 1, 2021
Tags : 1