Breaking News

హైదరాబాద్‌లో స్టీల్ స్ట్రక్చర్స్ యూనిట్

Published on Mon, 11/03/2025 - 17:12

‍ప్రముఖ స్ట్రక్చరల్‌ స్టీల్‌ సంస్థ ఫాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్స్ తమ రెండవ తయారీ యూనిట్‌ను తెలంగాణలో ప్రారంభించింది. హైదరాబాద్ సమీపంలోని చిట్యాల్‌ వద్ద రూ.120 కోట్ల పెట్టుబడితో 40 ఎకరాల్లో ఈ తయారీ కేంద్రం ఏర్పాటైంది.

నూతన మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏటా 50 వేల మెట్రిక్‌ టన్నుల అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని అందిస్తుంది. దీంతో కంపెనీ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం రెండు యూనిట్లలో కలిపి లక్ష మెట్రిక్‌ టన్నులకు పెరగనుంది.

ఈ ఫాబెక్స్ సంస్థ ప్రీ-ఇంజినీర్డ్ నిర్మాణాలు, ఉక్కు అమరికల రూపకల్పన, డిటైలింగ్, తయారీ, ఇన్‌స్టాలేషన్ వంటి విభాగాల్లో పనిచేస్తుంది. కంపెనీ ప్రస్తుతం విజయవాడలోని యూనిట్ ద్వారా దేశీయ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచే ఉత్పత్తుల ఎగుమతులు సైతం చేస్తోంది.

ప్రస్తుతం రూ.463 కోట్ల టర్నోవర్ కలిగిన ఫాబెక్స్, 400 మందికి ఉపాధి కల్పిస్తోంది. కార్యకలాపాల విస్తరణతో, ఈ సంఖ్యను 800 మందికి పెంచాలని యోచిస్తోంది. తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రాబోయే 2–3 ఏళ్లల్లో మరో రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు ఫాబెక్స్ స్టీల్ స్ట్రక్చర్స్ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ వేణు చావా తెలిపారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి