Breaking News

ఎగుమతుల ‘రికార్డు’ కొనసాగుతుంది

Published on Sat, 02/18/2023 - 06:33

న్యూఢిల్లీ: భారత్‌ వస్తు ఎగుమతుల రికార్డు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) కూడా కొనసాగుతుందని భారత్‌ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఐఈఓ) ప్రెసిడెంట్‌ ఏ శక్తివేల్‌ స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే, 2021–22లో ఎగుమతులు 422 బిలియన్‌ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. 2022–23లో 3 నుంచి 5 శాతం వృద్ధితో 435–445 బిలియన్‌ డాలర్లకు చేరుతాయన్న విశ్వాసాన్ని తాజాగా శక్తివేల్‌ వ్యక్తం చేశారు.

అంతర్జాతీయంగా అనిశ్చితి, డిమాండ్‌ మందగమనం ఉన్నప్పటికీ భారత్‌ ఆల్‌టైమ్‌ రికార్డు కొనసాగుతందని విశ్లేషించారు. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం, భారత్‌ వస్తు ఎగుమతులు వరుసగా రెండోనెల జనవరిలోనూ క్షీణతను నమోదుచేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 నెలల కాలంలో (ఏప్రిల్‌–జనవరి) వస్తు ఎగుమతులు 8.51 శాతం పెరిగి 369.25 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

ఘనంగా 58వ వ్యవస్థపక దినోత్సవాలు
కాగా, ఎఫ్‌ఐఈఓ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శక్తివేల్‌ ఈ సందర్భంగా తెలిపారు. మూడు వారాల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా– మార్చి 9 నుంచి 11 మధ్య  ‘సోర్సెక్స్‌ ఇండియా’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆహారం, ఫార్మా, ఆయుర్వేదం, హస్త కళలు, ఎఫ్‌ఎంసీజీ, జౌళి వంటి రంగాల్లో అవకాశాలను ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. సూపర్‌ మార్కెట్‌లు, హైపర్‌మార్కెట్లు, రిటైల్‌ చైన్‌లు, దిగుమతిదారులుసహా దాదాపు 35 దేశాలు నుంచి ప్రతినిధులు ఈ ఈవెంట్‌లో పాల్గొనేందుకు తమ ఆసక్తిని కనబరిచినట్లు తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)