Breaking News

ఏదైనా పడాల్సిందే.. నష్టాలూ మంచివే!

Published on Sat, 03/23/2024 - 14:39

స్టాక్‌ మార్కెట్‌ అంటేనే ఒడిదుడుకుల సహజం. పెట్టుబడి పెట్టిన స్టాక్‌లకు సంబంధించి, సెబీ, ఆర్‌బీఐ, ప్రభుత్వం.. తీసుకునే నిర్ణయాలకు సంబంధించి చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో మార్కెట్లు స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది.. మరోరోజు తిరిగి గరిష్ఠ స్థాయికి చేరుతుంది. మార్కెట్‌లో నిత్యం పెరిగే స్టాక్‌లు ఉండవు. ఎంత మంచి ఫండమెంటల్స్‌ ఉన్న కంపెనీ షేర్‌ అయినాసరే ఎప్పుడోఒకప్పుడు పడిపోవాల్సిందే.

ఇటీవల మధ్య, చిన్న స్థాయి షేర్ల ధరలు బుడగల్లా పెరుగుతూ వస్తున్నాయని, ఇవి ఏమాత్రం సహేతుకంగా కనిపించడం లేదని మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ అభిప్రాయం వ్యక్తం చేసింది. చిన్న మదుపరులు పెట్టుబడులు పెట్టే ముందు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో అనుసరించాల్సిన మార్గాలేమిటో నిపుణులు తెలియజేస్తున్నారు.

ఆందోళనతో నష్టాలు..

మార్కెట్‌ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అస్థిర మార్కెట్‌లో ఎన్నో భయాందోళనలు ఉంటాయి. వదంతులు వస్తుంటాయి. వీటన్నింటి ఆధారంగా పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఆందోళనలకు గురిచేసే విశ్లేషణలు, సలహాలతో చాలామంది తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, నష్టపోవడం చూస్తూనే ఉంటారు. మార్కెట్లు తిరిగి కోలుకున్నప్పుడు రాబడి ఆర్జించే అవకాశాలు కోల్పోతారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలాంటివి మీ దగ్గరున్న నగదు నిల్వల విలువను తగ్గిస్తాయి. పెట్టుబడుల రూపంలో ఉన్నప్పుడే మంచి ఫలితాలు రాబట్టుకోగలం. పెట్టుబడుల విలువ తగ్గిపోగానే ఆందోళన చెందడం కాదు. మీరు తెలుసుకుంటున్న సమాచారం ఎంత మేరకు సరైనదో చూసుకోండి. మార్కెట్లు పడిపోతున్నప్పుడు పెట్టుబడుల విలువ తగ్గడం సహజమేననే వాస్తవాన్ని అంగీకరించాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోవాలి.

దీర్ఘకాలంలో అధిక రాబడి

దీర్ఘకాల లక్ష్యాలతో మార్కెట్‌లో పెట్టుబడి పెడితే అధికమొత్తంలో రాబడి అందుతుంది. చాలా మంది మొదట లాంగ్‌టర్మ్‌ కోసమనే మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తారు. కానీ ఇతర కారణాల వల్ల స్వల్పకాలంలోనే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకుంటారు. దాంతో నష్టమే కలుగుతుంది. పెట్టుబడులు ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక లక్ష్యానికి అనుగుణంగా ఉండాలి. వాటిని సాధించే వరకూ మదుపు సాగుతూనే ఉండాలి. మధ్యలోనే వదిలేయొద్దు.

నష్టాన్ని పరిమితం చేసేలా..

మార్కెట్‌లో నష్టం రావడం సాధారణం. అలాఅని తీవ్ర నష్టాల్లోకి వెళ్లే వరకు పెట్టుబడులను కొనసాగించకూడదు. ఫలానా నష్టం వరకు భరించేలా స్టాప్‌లాస్‌ను ఉంచుకోవాలి. నష్టభయాన్ని పరిమితం చేసుకునేందుకు ప్రయత్నించాలి. పెట్టుబడులు ఒకే చోట కాకుండా.. పలు పథకాలకు కేటాయించాలి. నష్టభయం అధికంగా ఉంటూ, ఎక్కువ రాబడినిచ్చే పథకాల్లో కొంత, సురక్షిత పథకాల్లో కొంత మొత్తం మదుపు చేయాలి. ఈక్విటీ ఆధారిత పెట్టుబడులే కాకుండా, పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్ల వంటి స్థిరాదాయ పథకాలనూ ఎంచుకోవాలి. 

ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్లు అ‘ధర’హో..

మార్కెట్‌ పతనం మంచి అవకాశం

మంచి యాజమాన్యం, పనితీరు బాగున్న సంస్థల షేర్లు పతనం సమయంలో అందుబాటు ధరలోకి వస్తాయి. ఇలాంటి వాటిని ఎంచుకొని, దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయాలి. మార్కెట్లు మళ్లీ పెరుగుతున్నప్పుడు ఇవి మంచి లాభాలను పంచే అవకాశం లేకపోలేదు. మంచి షేర్లను అవకాశాన్ని బట్టి యావరేజ్‌ చేసుకోవచ్చు. నష్టభయాన్ని ఎంత మేరకు భరించగలరో చూసుకోవాలి.

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)